సాధారణంగా పెద్ద హీరోలు కొత్త హీరోయిన్లతో సినిమాలు చేయడం అరుదు. తమ రేంజికి తగ్గట్లు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తుంటారు. కొత్తమ్మాయిలను పెట్టుకుంటే హీరోల ఇమేజ్ ముందు వాళ్ల తూగరేమో అనే భయం ఉంటుంది. ఈ కారణంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చాలా కాలం నుంచి కొత్త అమ్మాయిలను నటింపజేయట్లేదు. గత దశాబ్ద కాలంలో ఒక్క ‘పంజా’ మూవీలో మాత్రమే సారాజేన్ డయాస్ అనే కొత్తమ్మాయితో పవన్‌కు జోడీ కట్టించారు. నిజానికి ఆ అమ్మాయి కూడా బాలీవుడ్లో అప్పటికే కొంచెం పాపులారిటీ ఉన్న అమ్మాయే.
ఆ తర్వాత మాత్రం పవన్ ఏ అప్‌కమింగ్, డెబ్యూ హీరోయిన్లతో నటించలేదు. ఐతే ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత పవన్‌కు జోడీగా ఒక కొత్తమ్మాయి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాక్షి వైద్య అనే మోడల్ పవన్‌కు జోడీగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోయే కొత్త సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్‌గా పేర్కొంటున్నారు. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. నిజానికి ఈ అమ్మాయిని సురేందర్ రెడ్డి ప్రస్తుతం తీస్తున్న ‘ఏజెంట్’ మూవీకి కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే దీని గురించి ఇప్పటిదాకా అధికారిక సమాచారం అయితే లేదు. ఐతే ఇప్పుడేమో పవన్‌కు జోడీగా సాక్షి నటించబోతోందని, ఆమెతో నిర్మాత రామ్ తాళ్లూరి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని అంటున్నారు.
ఐతే ‘ఏజెంట్’ కోసం సాక్షి ఇప్పటికే పని చేస్తోందా.. ఆమె వర్క్ చూసి ఇంప్రెస్ అయి సురేందర్ పవన్ సినిమాకు కూడా తననే కథానాయికగా ఎంచుకున్నాడా అన్న దానిపై క్లారిటీ లేదు. ఐతే అఖిల్ లాంటి యంగ్ హీరో పక్కన కథానాయికగా చేసిన అమ్మాయి పవన్ పక్కన ఎలా ఉంటుందో.. ఇంత చిన్నమ్మాయితో రొమాన్స్ చేయడానికి పవన్ ఒప్పుకుంటాడో లేదో అన్న డౌటానుమానాలు కలుగుతున్నాయి నెటిజన్లకు. దీనిపై కొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు.
This post was last modified on October 26, 2021 2:28 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…