అయోమయంలో పుష్ప!

రంగస్థలం తర్వాత మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళడానికి సుకుమార్ కి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదట్లో మహేష్ తో అనుకున్న సినిమా ముందుకి కదలకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కూడా ఏడాది పైగా వేచి చూసాక కానీ బన్నీ ఫ్రీ అవలేదు. తీరా షూటింగ్ కి వెళ్లొచ్చు అనుకునేంతలో కరోనా కలకలం వచ్చి పడింది. మిగతా వాళ్ళు షూటింగ్ ఇక్కడే ఏదో ఒక మూల చేసేసుకుందాం అనుకుంటున్నారు.

కానీ పుష్ప షూటింగ్ అలా ఎక్కడో అక్కడ చేసుకోవడానికి లేదు. కచ్చితంగా అడవులలో షూటింగ్ చేయాలి కనుక పుష్ప ఇప్పట్లో మొదలయ్యే వీలు లేదు. అల్లు అర్జున్ అయితే మరో నాలుగు నెలల పాటు ఎదురు చూడక తప్పదని ఫిక్స్ అయిపోయాడట. కాకపోతే సుకుమార్ మాత్రం ఏమైనా చేయవచ్చునేమో అని ఆర్ట్ డైరెక్టర్లతో సమాలోచనలు జరుపుతున్నాడట. మరోవైపు రష్మిక కూడా షూటింగ్ కి ఇప్పట్లో రాలేనని చెప్పిందట. చూస్తోంటే సుకుమార్ కి మరి కొన్ని నెలల ఎదురుచూపులు తప్పేటట్టు లేవు.