టాలీవుడ్ అందమైన భామ ఒకరు కఠినమైన సవాలును పూర్తి చేశారు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ అధిరోహించారు. హీరోయిన్లు అంటే ఏసీ కారవాన్లలో విశ్రాంతి తీసుకునే సున్నిత వ్యక్తులు అనుకునే వారు ఇప్పటికే చాలామందే ఉన్నారు. నివేదా థామస్ తాజా ఫీట్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్.
ఎంతో ట్రెక్కింగ్ అనుభవం ఉన్నవారు మాత్రమే సాధించే ఫీట్ ను రీల్ లో గ్లామర్ సొగసులతో మనసుల్ని దోచుకునే హీరోయిన్.. సాధించడం అసాధారణ విషయమే కదా. అది కూడా ఆఫ్రికా ఖండంలో కఠిన వాతావరణ పరిస్థితులున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించటం అంత తేలికైన విషయం కాదు.
తన కెరీర్ లో మొదట్నించి రోటీన్ పాత్రలకు కాస్తంత భిన్నంగా.. తన మార్కు కనిపించేలా సినిమాలు చేసే నివేదా చివరి సినిమా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్. అందులో ముగ్గురు అమ్మాయిల్లో పల్లవి పాత్రను పోషించారు. ప్రస్తుతం మీట్ క్యూట్ లో నటిస్తున్న ఆమె.. తాజాగా ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. శిఖరాగ్రానికి చేరుకున్న వేళ.. తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
చిన్నతనం నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఈ మక్కువతో ఆర్నెల్లపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆమె.. సముద్ర మట్టానికి 19,340 అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అత్యంత కష్టమైన.. క్లిష్టమైన పర్యతారోహణగా దీన్ని చెబుతారు. అలాంటిది అత్యంత సాహసోపేతంగా ఆమె సాధించిన తీరు చూస్తే.. మిగిలిన గ్లామర్ భామలకు నివేదా భిన్నమని చెప్పాలి.
This post was last modified on October 24, 2021 12:28 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…