సినిమా టికెట్ రేట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం నాలుగు షోలకు అనుమతిచ్చింది. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ వంటి సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు టికెట్ రేట్లు పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రీసెంట్ గా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈ టికెట్ రేట్ల విషయంలో ఏమైనా సాయం చేయగలరా..? అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్.. విష్ణుకి బావ అవుతారు.
‘మా’ ఎన్నికల సమయంలో కూడా జగన్ మా బావ అంటూ విష్ణు ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు విష్ణు కోరినా కూడా టికెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేలా లేరు. ఆ డెసిషన్ సంక్రాంతికి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కాబట్టి టికెట్ రేట్ల పెంపు జనవరిలో ఉండొచ్చని చెబుతున్నారు. 150 రూపాయలకు మించి రేట్లయితే పెరగవు కానీ కొన్ని సింగిల్ థియేటర్స్ లో 20, 30 రూపాయలకు టికెట్లను మాత్రం 50 నుంచి 55 రూపాయలను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపిందట. ప్రభుత్వం ఎలాంటి నియమాలు విధించినా.. భారీ సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ఎక్కువ రేట్లకు టికెట్లను అమ్మడం చూస్తూనే ఉన్నాం.
This post was last modified on October 23, 2021 11:37 am
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…