కాన్సెప్ట్‌ని డీవియేట్ చేస్తాయని డౌటొస్తే సినిమాల్లో పాటలు పెట్టడం మానేస్తున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. కానీ వెబ్ సిరీస్‌లో పాటలు పెడతానంటున్నాడు బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడైన సంజయ్ లీలా భన్సాలీ. అది కూడా ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఇరవై.
‘హీరామండీ’ సినిమా తీయాలని పద్నాలుగేళ్ల పాటు కలలు కన్నాడు భన్సాలీ. అది కార్యరూపం దాల్చక పోవడంతో వెబ్ సిరీస్‌గా తీయడానికి నెట్‌ఫ్లిక్స్‌తో టై అప్ అయ్యాడు. ఈ మధ్యనే అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశాడు. ఈ సిరీస్‌కి రచన, దర్శకత్వంతో పాటు మ్యూజిక్ డైరెక్షన్ కూడా తనే చేయబోతున్నాడు. ఆల్రెడీ ఇరవై నుంచి ఇరవై అయిదు పాటలు కూడా కంపోజ్ చేశాడట. వాటిలో పదహారు నుంచి ఇరవై పాటల్ని ఈ సిరీస్‌కి వాడతాడట. ఈ లెక్కన ఎన్ని ఎపిసోడ్స్ తీయబోతున్నాడు, ఎన్ని సీజన్లు తీసుకు రానున్నాడు!
బేసిగ్గా వెబ్ సిరీసుల విషయంలో ఓ సమస్య ఉంటుంది. టైట్ స్క్రీన్ ప్లే ఉంటేనే అన్ని ఎపిసోడ్లూ ఓపిగ్గా చూస్తారు ప్రేక్షకులు. కాస్త ల్యాగ్ ఉన్నా ఫార్వార్డ్ చేసేస్తారు. అలాంటిది సిరీస్‌లో పాటలు పెట్టడమేంటి, అందులోనూ ఇన్ని పెట్టడమేంటి అంటూ బాలీవుడ్ వారు అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. ఎంత గొప్ప ఫిల్మ్ మేకర్ అయినా భన్సాలీ రిస్క్ తీసుకుంటున్నాడు అంటూ పెదవి విరుస్తున్నవారూ ఉన్నారు.
పైగా ఈ కథ కూడా ఇప్పటిది కాదు. ముఘలుల కాలంలో తాము యుద్ధాల్లో ఓడించిన రాజుల భార్యలను, వేరే దేశాల నుంచి మనసు పడి తెచ్చుకున్న అమ్మాయిలను హీరామండీ అనే చోట ఉంచేవారు ముఘల్ చక్రవర్తులు. వారి కేళీ విలాసాలన్నీ అక్కడే జరిగేవట. అది కాస్తా మెల్లమెల్లగా వేశ్యా వాటికగా మారిపోయింది. ఆ చరిత్ర మీదే ఈ సిరీస్ తీయబోతున్నాడు భన్సాలీ. టాప్ స్టార్స్‌ని తీసుకోబోతున్నాడు. కథ ఎప్పటిదో అయినా ఇప్పటి వారికి నచ్చేలా తీస్తానంటున్నాడు. చూడాలి మరి ఏం తీస్తాడో, ఎలా మెప్పిస్తాడో!
This post was last modified on October 22, 2021 9:54 am
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…