సినిమాల కోసం పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. ముందు బాహుబలి తర్వాతన్నాడు. ఆపై సాహో అయిపోవాలన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా పూర్తి చేశాక ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఐతే ప్రభాస్‌తో ‘సాహో’ సినిమా చేసిన యువ దర్శకుడు సుజీత్ మాత్రం తన హీరోలా చేయట్లేదు.
అతడి వయసింకా 30 లోపే. ‘సాహో’ డిజాస్టర్ అయినప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో తర్వాతి సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు అతడి ఫోకస్ అంతా ఆ చిత్రం మీదే.
అలాగని వ్యక్తిగత జీవితంలో అతి పెద్ద విశేషం అయిన పెళ్లిని ఆ సినిమా కోసం ఏమీ వాయిదా వేసుకోవట్లేదు. చిరు సినిమాను పట్టాలెక్కించడానికి ముందే అతను పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని సుజీత్ పెళ్లాడబోతున్నాడు.
సినిమా వాళ్లు చాలామంది డాక్టర్లను పెళ్లాడటం చూస్తుంటాం. ఈ మధ్యే నిఖిల్ సైతం ఓ వైద్యురాలినే పెళ్లాడాడు. సుజీత్ కూడా అదే బాటలో నడవనున్నాడు. తాను ప్రేమించిన ప్రవల్లిక అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ నెల 10న వీరి నిశ్చితార్థం జరగబోతోందట. ఇంకొన్ని నెలల్లో పెళ్లి ఉంటుందట.
లాక్ డౌన్ తొలగిపోయి మామూలు పరిస్థితులు నెలకొన్నాకే పెళ్లి అంటున్నారు. ప్రవల్లిక టిక్ టాక్‌లో బాగా ఫేమస్ అని అంటున్నారు. కొన్నేళ్లుగా ఆమె సుజీత్‌తో ప్రేమలో ఉందట. షార్ట్ ఫిలిమ్స్‌తో సత్తా చాటి ‘రన్ రాజా రన్’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్న సుజీత్.. తొలి ప్రయత్నంలోనూ సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
ఆ తర్వాత ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. అంత పెద్ద సినిమాను డీల్ చేయడంలో సుజీత్ అనుభవ లేమి కనిపించింది. ఈసారి అతను రీమేక్ చేయబోతున్నాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ను చిరుతో తీయబోతున్నాడు. ఈ ఏఢాది చివర్లో ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on June 3, 2020 2:03 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…