Movie News

తమిళ హీరోకు సర్ప్రైజ్ వెల్కమ్

శివకార్తికేయన్ అని తమిళ యంగ్ హీరో. మన దగ్గర రవితేజ, విజయ్ దేవరకొండ తరహాలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన కుర్రాడితను. ఒకప్పుడు విజయ్ టీవీలో అతను వీడియో జాకీగా పని చేయడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కొన్ని చేశాడు. ధనుష్‌తో మంచి అనుబంధం ఉండటం కలిసొచ్చి హీరో అయ్యాడు. వరుసగా హిట్లు కొట్టి చూస్తుండగానే స్టార్ అయిపోయాడు.

మధ్యలో కొన్ని సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చినా.. మళ్లీ పుంజుకున్నాడు. తాజాగా అతను ‘డాక్టర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి కరోనా నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. కానీ తర్వాత ఎందుకో మనసు మార్చుకుని దసరా ముంగిట థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఊహించని స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి.

కొంచెం థ్రిల్లింగ్‌గా.. అలాగే వినోదాత్మకంగా సాగిన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ పేరుతో రిలీజ్ చేశారు. విడుదల సమయంలో దీన్ని మన వాళ్లు పెద్దగా పట్టించుకోనట్లే కనిపించారు. దసరాకు ముందు వారాంతంలో రిలీజైన కొండపొలం, ఆరడుగుల బుల్లెట్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, అదే సమయంలో ‘వరుణ్ డాక్టర్’ బాగుందన్న టాక్ రావడంతో నెమ్మదిగా అటు వైపు మళ్లారు. సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కూడా అయింది. దసరా టైంలో కూడా ఈ సినిమా బాగానే ఆడింది. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.

శివకార్తికేయన్ ఇంతకుముందు ‘రెమో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘వరుణ్ డాక్టర్’తో అతడికి మంచి గుర్తింపే వచ్చింది. త్వరలో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ద్వారా నేరుగా తెలుగులోకి అడుగు పెట్టబోతున్నాడు శివ. దానికి ముందు ‘వరుణ్ డాక్టర్’ మంచి స్పందన తెచ్చుకుని అతడికి ఇక్కడ బేస్ ఏర్పడేలా చేసింది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండటం విశేషం. ‘లవ్ స్టోరి’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేయనున్న ఈ చిత్రానికి శివ రూ.25 కోట్ల పారితోషకం అందుకోనున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం.

This post was last modified on October 20, 2021 6:35 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago