Movie News

‘మహాసముద్రం’కు తీసేసి.. ‘పెళ్ళిసందడి’కి..

ఈసారి దసరాకు మూడు సినిమాలు రిలీజైతే.. వాటిలో ఎక్కువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘మహాసముద్రం’ అనే చెప్పాలి. ఎందుకంటే అది ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అజయ్ భూపతి తీసిన సినిమా. శర్వానంద్-సిద్ధార్థ్-అదితిరావు హైదరిల క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు. దీని రెండు ట్రైలర్లూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి.

మంచి హైప్ మధ్య రిలీజైంది ‘మహాసముద్రం’. కానీ అంచనాలకు చాలా దూరంలో సినిమా నిలిచిపోయింది. అజయ్ భూపతి చెప్పినంత లోతు సినిమాలో అస్సలు కనిపించలేదు. ఐతే అంచనాలను అందుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. దసరా సీజన్లో రిలీజైన ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో పోలిస్తే ‘మహాసముద్రం’ ఎంతో మెరుగనే చెప్పాలి. దాంతో పోలిస్తే దీనికి స్టార్ కాస్ట్ కూడా ఉంది.

కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘పెళ్లిసంద-డి’ పైచేయి సాధిస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘మహాసముద్రం’ డిజాస్టర్ కాగా.. ‘పెళ్ళిసంద-డి’ మాత్రం హిట్ స్టేటస్ అందుకుంది. నాసిరకం, పాత శైలి కథాకథనాలతో తెరకెక్కినప్పటికీ.. చూడముచ్చటైన కొత్త జంట, అందంగా తీర్చిదిద్దిన పాటలు ‘పెళ్ళిసందడి’కి ప్లస్ అయ్యాయి.

రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి పెద్దగా బజ్ లేకపోవడం.. మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ చిత్రాల మీద ఎక్కువ అంచనాలుండటంతో దీనికి చాలా పరిమితంగా థియేటర్లు దక్కాయి. మేజర్ స్క్రీన్లను మిగతా రెండు చిత్రాలే పంచుకున్నాయి. ఐతే రిలీజ్ తర్వాత ‘మహాసముద్రం’ మీద ప్రేక్షకులకు ఆసక్తి లేకపోవడం, మరోవైపు ‘పెళ్ళిసంద-డి’కి స్పందన బాగుండటంతో దాని స్క్రీన్లు తగ్గించి దీనికి ఇచ్చేశారు. రిలీజ్ రోజుతో పోలిస్తే తర్వాతి రోజు నుంచి ‘పెళ్ళిసంద-డి’కి థియేటర్లు పెరగడం విశేషం.

This post was last modified on October 20, 2021 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

14 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago