పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది శాండిల్ వుడ్ భామ శ్రీ లీల. బెంగళూరుకు చెందిన ఈ అమ్మాయి కన్నడ సినీ పరిశ్రమలో కథానాయికగా ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. భరాట్, కిస్ లాంటి చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న శ్రీలీలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దృష్టి పడింది. దీంతో ఆయన దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాణంలో తెరకెక్కిన పెళ్ళి సందడిలో శ్రీలీలకు అవకాశం దక్కింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల తెలుగమ్మాయే అని రాఘవేంద్రరావు వెల్లడించారు. శ్రీలీల కూడా అదే మాట చెప్పింది. తన తండ్రి పేరు.. సూరపనేని శుభాకర్ రావు అని వెల్లడించింది.
ఐతే బెంగళూరులో పెద్ద వ్యాపారవేత్త అయిన శుభాకర్ రావు.. శ్రీలీల వ్యాఖ్యల్ని ఖండించారు. ఆమె తన కూతురు కాదన్నారు. శ్రీ లీల తల్లి తన మొదటి భార్య అని.. ఐతే ఆమె తాను విడిపోయాకే శ్రీలీల పుట్టిందని.. ఆమెతో తనకే సంబంధం లేదని శుభాకర్ రావు వివరించారు. ఆస్తులకు సంబంధించి శ్రీలీల తల్లికి, తనకు మధ్య కేసులు నడుస్తున్నాయని.. అవి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని.. ఐతే ఆస్తుల కోసమే శ్రీ లీల తనను తండ్రిగా పేర్కొంటోందని.. మీడియాకు అలా చెప్పి తప్పుదోవ పట్టిస్తోందని.. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు చేపడతామని మీడియాకు శుభాకర్ రావు చెప్పడం గమనార్హం.
మరి ఈ ప్రకటన నేపథ్యంలో శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సంగతలా వదిలేస్తే.. పెళ్ళిసందడి చిత్రానికి చాలా పేలవమైన టాక్ వచ్చింది. అయినప్పటికీ దసరా సెలవుల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. శ్రీలీలకు సినిమాతో మంచి పేరే వచ్చింది. పాటల్లో ఆమె గ్లామర్ బాగా హైలైట్ అయింది. తనకు మరిన్ని అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on October 18, 2021 8:52 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…