అల్లు అర్జున్ కొత్త సినిమాల పట్ల అంతులేని సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం అతను సుకుమార్‌తో ‘పుష్ప’ చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కానుండగా.. ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు అయిపోయినట్లే. ఈ చిత్రం డిసెంబరు 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. బన్నీ పని ఇంకొన్ని రోజుల్లోనే పూర్తయిపోతుంది. ఆ తర్వాత సుకుమార్ కనీసం ఆరు నెలలు బిజీగా ఉంటాడు.
‘పుష్ప’ పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్, ప్రమోషన్ల హడావుడితో ఇంకో మూణ్నెల్లు ఆయన బిజీగా ఉంటారు. ఆ తర్వాత ‘పుష్ప-2’ కోసం కొన్ని నెలలు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా ‘పుష్ప-2’ మొదలుపెట్టడానికి ముందు ఆరు నెలల దాకా బన్నీకి గ్యాప్ దొరుకుతుంది. ఈ గ్యాప్‌లో వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సినిమా లాగించేస్తాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
కానీ అల్లు అర్జున్ మిత్రుడు బన్నీ వాసు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే బన్నీ వెంటనే ‘ఐకాన్’ చేస్తాడనేమీ అనిపించట్లేదు. బోయపాటి శ్రీను, మురుగదాస్‌లతో కూడా బన్నీకి కమిట్మెంట్లు ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ సినిమా చేయాలనే విషయంలో బన్నీకి అసలు క్లారిటీ లేదనిపిస్తోంది వాసు మాటల్ని బట్టి చూస్తుంటే.
తన నిర్మాణంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ సందర్భంగా మీడియాను కలిసిన వాసు.. బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయితే తప్ప అల్లు అర్జున్ కొత్త సినిమాల లైనప్ గురించి స్పష్టత రాదు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాలని చూస్తున్నాం. మురుగదాస్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే ‘ఐకాన్’ ఉంది. ఐతే వీటిలో ఏది ముందు సెట్స్ మీదికి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం” అన్నాడు వాసు. అతడి మాటల్ని బట్టి చూస్తే మరోసారి ‘ఐకాన్’కు బ్రేకులు పడతాయేమో.. వేణుకు మరోసారి హ్యాండ్ ఇచ్చి బన్నీ వేరే సినిమా మొదలుపెట్టేస్తాడేమో అనిపిస్తోంది.
This post was last modified on October 14, 2021 3:13 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…