హీరోయిన్ పాత్రలే కాదు, ఐటమ్ సాంగ్స్లో వేసే స్టెప్పులు కూడా ఇమేజ్ను పెంచుతాయని ప్రూవ్ అయ్యి చాలా కాలమైంది. అందులోనూ స్టార్ హీరోలతో కాలు కదిపితే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. అందుకే టాప్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి సై అంటున్నారు. ఇప్పుడు శ్రద్ధాకపూర్ కూడా ఓ పాటలో మెరవడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. అది కూడా సౌత్ మూవీలో.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సాలార్’లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దాని కోసం శ్రద్ధని తీసుకున్నట్లు టాక్. నిజానికి ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి శ్రీనిధిశెట్టి డ్యాన్స్ చేస్తుందనే వార్తలొచ్చాయి. ఆల్రెడీ ‘కేజీయఫ్’లో ఆమె హీరోయిన్గా నటించింది కాబట్టి ప్రశాంత్ తనని సెలెక్ట్ చేశాడని అన్నారు. అయితే ‘సాలార్’ ప్యాన్ ఇండియా చిత్రం. పైగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రభాస్ నటిస్తున్నాడు. కాబట్టి తన రేంజ్కి, ఇమేజ్కి తగ్గట్టు స్టార్ హీరోయిన్ అయితేనే బెటరని ఫీలైన టీమ్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట.
ఆల్రెడీ ‘సాహో’లో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించింది కాబట్టి శ్రద్ధనే మరోసారి రిపీట్ చేస్తే బాగుంటుందని సంప్రదించారట. ఆమె కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. శ్రద్ధ చాలా మంచి డ్యాన్సర్. కొన్ని డ్యాన్స్ బేస్డ్ మూవీస్లో అదరగొట్టేసింది కూడా. శ్రీదేవి నటించిన చాల్బాజ్, నగీనా చిత్రాల సీక్వెల్స్లో శ్రద్ధని హీరోయిన్గా తీసుకున్నారంటే దానికి కారణం కూడా ఆమె గ్రేట్ డ్యాన్సర్ కావడమే. కాబట్టి ‘సాలార్’ విషయంలో చక్కర్లు కొడుతున్న న్యూస్ నిజమే అయితే, ప్రశాంత్ నీల్ది గుడ్ సెలెక్షన్ అని చెప్పొచ్చు.
This post was last modified on October 12, 2021 12:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…