ఒక తెలుగు నిర్మాత కేవలం తెలుగు కంటెంట్‌తో ఓటీటీ పెట్టి నెగ్గుకు రాగలరని ఎవరూ ఊహించలేదు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఆహా పేరుతో గత ఏడాది ఓటీటీలో రాబోతోందని వార్తలొచ్చినపుడు నెట్ ఫ్లిక్స్, అమేజాన్, హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ల నుంచి పోటీని తట్టుకుని మన లోకల్ ఓటీటీ ఏమేర నిలబడుతుందో అని సందేహించిన వాళ్లే ఎక్కువ. కానీ కలిసొచ్చిన కరోనా టైంను చక్కగా ఉపయోగించుకుని.. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బాగానే నిలదొక్కుకుంది ఆహా.
అంచనాల్ని మించి సబ్‌స్క్రైబర్లను ఆకర్షించిన ఆహా.. ఇప్పటిదాకా డబ్బింగ్ చిత్రాలకు తోడు.. తెలుగులో వచ్చే చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే నెట్టుకొస్తోంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే పేరున్న చిత్రాలు ఆహాలో రిలీజవుతున్నాయి. కానీ ఇప్పుడు ఆహా మరో స్థాయికి వెళ్లడానికి భారీ ప్రణాళికలతోనే సిద్ధమైంది. ఆహా వారి తాజా ప్రోమో చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో అతి పెద్ద విజయం సాధించిన లవ్ స్టోరి సినిమా ఈ నెల 22న ఆహాలో రాబోతోంది. ఇది మాత్రమే కాదు.. దసరా కానుకగా రిలీజయ్యే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అరవింద్ కొడుకు అల్లు బాబీ నిర్మిస్తున్న వరుణ్ తేజ్ సినిమా గని, నాగశౌర్య మూవీ లక్ష్య, ఆనంద్ దేవరకొండ మూవీ పుష్పక విమానం, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు, మారుతి మూవీ మంచి రోజులు వచ్చాయి, పూరి ఆకాశ్ నటించిన రొమాంటిక్, రాజ్ తరుణ్ కొత్త చిత్రం అనుభవించు రాజా.. ఇలా రాబోయే మూడు నెలల్లో క్రేజీ సినిమాలు చాలానే ఆహాలోకి రాబోతున్నాయి.
ఇవి కాక మారుతి ప్రొడక్షన్లో తెరకెక్కిన 3 రోజెస్, ప్రియమణి, రాజేంద్ర ప్రసాద్ వేర్వేరుగా నటించిన ఒరిజినల్స్ సహా వెబ్ సిరీస్‌లు కూడా పెద్ద ఎత్తునే ఆహాలో ప్రసారం కాబోతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కూడా ఆహాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఈ ప్లాన్స్ చూస్తుంటే ఆహా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్లోకి అడుగు పెడుతున్నట్లే ఉంది.
This post was last modified on October 11, 2021 6:50 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…