మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పుణ్యమా అని టాలీవుడ్లో ఎంతటి చిచ్చు రేగిందో తెలిసిందే. ఇండస్ట్రీ జనాల్లో లోలోన ఎన్ని గొడవలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ఒకరి గురించి ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసిన ఉదంతాలు అరుదుగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా నోరు జారడం, ఒక మాట అనడం మినహాయిస్తే.. వ్యక్తుల్ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా కనిపించవు.
కానీ మా ఎన్నికల్లో రెండు ప్యానెళ్ల వాళ్లు ఒకరి మీద ఒకరు దారుణమైన మాటలు అనుకున్నారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలకు వెళ్లారు. అవి చివరికి మరీ శ్రుతి మించిపోయి వ్యక్తిగత వ్యాఖ్యలు, దూషణల్లోకి దిగిపోయారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్‌కు మద్దతుదారైన నాగబాబు ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పిపోయారు.
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని కోట వ్యతిరేకిస్తుండటం, ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారని చిరంజీవిని కూడా ప్రశ్నించినట్లు పేర్కొనడం తెలిసిందే. దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడు. అతను ఐదుసార్లు జాతీయ అవార్డు సాధించాడు.
తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చాడు. ఈ కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ లాంటి వాళ్ల కంటే అతను సుపీరియర్ యాక్టర్ కదా. వీళ్లందరూ అతనంటే అసూయతో కుంగిపోతున్నారు ఎందుకు? అయినా ఆ కోట శ్రీనివాసరావుకు ఎందుకండీ ఈ వయసులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వూడిపోతాడో తెలియదు. అనకూడదు కానీ ఈ మాట. అతని వయసుకు తగిన మాట మాట్లాడట్లా. అతని మాటలు విని విని విసుగొస్తోంది. ప్రకాష్ రాజ్ మన భాష కాకపోతే తరిమేస్తారా? నటులకు మన, పర ఏంటండీ. వీళ్లా నటులు. నటులంటే విశాల దృక్పథం ఉండాలి. వీళ్లకు మానవత్వం లేదు. నటన విషయంలో వీళ్లందరూ ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోరు అని నాగబాబు అనేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారమే రేపుతున్నాయి.
This post was last modified on October 10, 2021 6:35 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…