ఆరడుగుల బుల్లెట్.. ఏడెనిమిదేళ్ల ముందు మొదలైన సినిమా. మేకింగ్ దశలో ఉండగా ఆర్థిక సమస్యలు, ఇంకేవో ఇబ్బందులు తలెత్తి ఏళ్లకు ఏళ్లు ఆలస్యమైందీ చిత్రం. ఎలాగోలా సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తే నాలుగేళ్ల కిందట రిలీజ్ రోజు ఉదయం ఆ చిత్రానికి బ్రేక్ పడింది. ఇక ఆ తర్వాత సినిమా అడ్రస్ లేదు. ఇక ఎప్పటికీ ఈ సినిమా విడుదలే కాదనుకుంటే.. ఇటీవల గోపీచంద్ సినిమా సీటీమార్ థియేటర్లలో కొంచెం సందడి చేయడంతో ఈ చిత్రాన్ని బయటికి తీశారు. ఎలాగోలా కష్టపడి శుక్రవారం ఆరడుగుల బుల్లెట్‌ను థియేటర్లలోకి దించారు.
కానీ చాలా తక్కువ అంచనాలతో థియేటర్లకు వెళ్లినప్పటికీ ఈ సినిమా తీవ్ర నిరాశకే గురి చేసింది. ఏడెనిమిదేళ్ల ముందు మొదలుపెట్టిన సినిమా, పైగా ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయిన బి.గోపాల్ డైరెక్షన్.. కాబట్టి సినిమా ఏమాత్రం కొత్తగా ఉండదని, రొటీన్ మాస్ మూవీనే అనుకుని తక్కువ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు మరీ ఔట్ డేటెడ్ మూవీ చూపించి తీవ్ర నిరాశకు గురి చేశాడు గోపాల్. ఆవారా తిరిగే కొడుకు.. అతణ్ని అపార్థం చేసుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టే తండ్రి.. కట్ చేస్తే విలన్ వల్ల తండ్రికి కష్టమొస్తే తిరిగి ఆ కొడుకే కాపాడే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ లైన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.
వక్కంతం వంశీ సినిమాలంటే ఏదో ఒక ట్విస్ట్, టిపికల్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటాయి. కానీ ఇందులో అవేమీ లేవు. ఇక ఆరేళ్ల ముందే చనిపోయిన ఎమ్మెస్ నారాయణ.. గత కొన్నేళ్లలో తనువు చాలించిన జయప్రకాష్ రెడ్డి, గుండు హనుమంతరావు లాంటి వాళ్లు తెరపై కనిపించడం, బ్రహ్మానందం ఒకప్పటి స్టయిల్లో కామెడీ చేయడం.. మిగతా ఆర్టిస్టులు కూడా పాత లుక్స్‌లో కనిపించడంతో ఈ సినిమా మరింత ఔట్ డేటెడ్ అనిపించింది. హీరో గోపీచంద్ ఈ సినిమాను పట్టించుకోకపోవడం, ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో ఆరడుగుల బుల్లెట్ రిలీజైందంటే రిలీజైంది అనిపించి మరుగున పడిపోయేలా కనిపిస్తోంది.
This post was last modified on October 9, 2021 7:59 am
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…