మా వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకు.. మాక్కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ.. ఫిలిం సెలబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. విన్నపాలూ చేస్తారు. కానీ సినీ జనాల వ్యక్తిగత విషయాల గురించి జనాలకు ఉండే ఆసక్తే వేరు. ఈ సోషల్ మీడియా రోజుల్లో మిగతా విషయాలకంటే వాటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. గత కొన్ని వారాలుగా నాగచైతన్య-సమంతల వైవాహిక బంధం దెబ్బ తినడంపై ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. అది ఎంతకీ ఆగడం లేదు.
ముందు వాళ్లిద్దరి విడాకుల గురించ ఊహాగానాలు నడిచాయి. ఆ తర్వాత వారి నుంచి అధికారిక ప్రకటన రాగానే.. ఆ విడాకులకు దారి తీసిన కారణాల మీద ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ సోషల్ మీడియా కాలంలో దీన్ని నివారించడం అసాధ్యం అనే చెప్పాలి. తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చిన మరో పర్సనల్ ఫొటో గురించి కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఇదేమీ కొత్తది కూడా కాదు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్.. తెలుగులో కొన్నేళ్లుగా క్యారెక్టర్ రోల్స్‌తో ఆకట్టుకుంటున్న కన్నడ నటి పవిత్ర లోకేష్‌లకు సంబంధించిన ఫొటో ఇది. తాజాగా కృష్ణ కూతురు ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందులో కృష్ణతో పాటు నరేష్, గల్లా అశోక్, నరేష్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఐతే నరష్ పక్కన పవిత్ర లోకేష్ కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. సినీయేతర కార్యక్రమాల్లో నరేష్‌తో పవిత్ర కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి కనిపించినపుడు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఈ మధ్య అందరూ వీరి కలయికకు అలవాటు పడిపోయారు. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
‘సమ్మోహనం’ సినిమా కోసం భార్యాభర్తలుగా కలిసి నటించినప్పటి నుంచి వీరి మధ్య బంధం బలపడినట్లు తెలుస్తోంది. ఐతే నరేష్.. ఒక పెళ్లి తర్వాత, కొన్నేళ్ల కిందట హిందూపురంలో రెండో వివాహం చేసుకోవడం తెలిసిందే. పవిత్ర కూడా సుచేంద్ర ప్రసాద్ అనే కన్నడ నటుడిని 2007లో పెళ్లి చేసుకుంది. ఆయనకది రెండో వివాహం. ఆయనతో ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ విడిపోయినట్లు అయితే వార్తలేమీ రాలేదు. మరోవైపు నరేష్ రెండో భార్య నుంచి విడిపోయినట్లు కూడా మీడియాలో ఏ సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో వీరి బంధం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on October 8, 2021 10:23 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…