హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్.. ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా ‘మనుచరిత్ర’ అనే సినిమాను ఎన్. శ్రీనివాస్‌రెడ్డి, రాన్సన్ జోసెఫ్‌లతో కలిసి నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు భరత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లు.
ఈ మూవీ ప్రీఫేస్‌ని తాజాగా రిలీజ్ చేశారు. దాన్ని బట్టి ఇదో ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతోంది. ముగ్గురమ్మాయిల వల్ల ఇబ్బందులు పడే అబ్బాయిగా శివ కనిపిస్తున్నాడు. ‘ప్రేమలో పడటం ఓ బాధాకరమైన ఆనందం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టే తీవ్రమైన బాధలో కనిపిస్తున్నాడు శివ. ఇలా బతకడం కంటే చావడం బెటర్ అని ఆత్మీయులు తిట్టేంతగా కుమిలిపోతున్నాడు. కాస్త వయొలెంట్‌గా కూడా కనిపిస్తున్నాడు. టోటల్‌గా ఇదెంతో లోతైన, బరువైన కాన్సెప్ట్ అని ఈ వీడియో ద్వారా అర్థమయ్యింది. అసలు కథేంటి, శివ జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలిగింది. గోపిసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
మొత్తానికి నిర్మాతగా మారడానికి కాజల్ మంచి కాన్సెప్టే ఎంచుకుందనిపిస్తోంది. నిజానికామె ప్రశాంత్ వర్మ మూవీతో కానీ, సుధీర్ వర్మ సినిమాతో కానీ ప్రొడ్యూసర్ అవుతుందని, ఓ ఫేమస్ హీరో చిత్రాన్ని నిర్మిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ శివ లాంటి న్యూ అండ్ యంగ్ హీరోని సెలెక్ట్ చేసుకుందంటే, కచ్చితంగా కాన్సెప్ట్ మీద నమ్మకమే అయ్యుండొచ్చు. అదొక్కటీ చాలు కదా, ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడటానికి!
This post was last modified on October 7, 2021 1:27 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…