టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. విడాకుల వ్యవహారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
అలాంటిది ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంలో పలు కథనాలు వస్తున్నాయి. సినీ తారలు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు.
కొంతమంది ఈ విషయంలో సమంతను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు చైతన్యకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నాగచైతన్య-సమంత విడాకులపై నటుడు రాజీవ్ కానుకగా కూడా స్పందించారు. ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించారు రాజీవ్ కనకాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చై -సామ్ విడుదకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించనని.. అది వాళ్ల వ్యక్తిగతమని అన్నారు. వాళ్లు విడిపోవడం చాలామందికి బాధ కలిగించిందని.. తనకు కూడా బాధగానే ఉందని అన్నారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ ఏం తెలియదని.. కాబట్టి వాళ్ల జీవితాలపై స్పందించే అర్హత మనకు లేదని చెప్పారు. కానీ చైతన్య చాలా మంచి వ్యక్తి అని.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని.. విసుగు అంటే ఏంటో తెలీదని గొప్పగా చెప్పారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చైతుని ప్రేమిస్తారని.. అంత మంచి నేచర్ ఉన్న వ్యక్తి అని తెలిపారు.
This post was last modified on October 6, 2021 1:56 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…