Movie News

ప్ర‌భుత్వ ఆదేశం.. ముద్దులొద్దు.. ఫైట్లు వ‌ద్దు

లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా రెండున్న‌ర నెల‌లుగా సినీ కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోయాయి. షూటింగులు జ‌ర‌గ‌ట్లేదు. థియేట‌ర్లు న‌డ‌వ‌ట్లేదు. ఐతే థియేట‌ర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. ఐతే షూటింగ్‌ల‌కు అయినా అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను సినీ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు కోరుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఇందుకు సుముఖత వ్య‌క్తం చేసింది. చ‌ర్చ‌లు జ‌రిగాయి. త్వ‌ర‌లోనే దీనిపై మార్గ‌ద‌ర్శ‌కాలు రాబోతున్నాయి. ఈలోపు క‌రోనా ఉద్దృతి తీవ్ర స్థాయిలో ఉన్న మ‌హారాష్ట్రలో షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించ‌డం విశేషం. బాలీవుడ్‌కు కేంద్రం అయిన ముంబ‌యిలో షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని ష‌ర‌తులు పాటిస్తూ షూటింగులు జ‌రుపుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది.

అయితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు షూటింగ్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం షూటింగ్‌లు జ‌రిగే చోట‌ తప్పకుండా అంద‌రూ భౌతిక దూరం పాటించాలి. ఆ ప్ర‌దేశాల‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి. అదే విధంగా నటీనటులు మేక‌ప్‌మెన్‌ల‌ను పెట్టుకోకుండా సొంతంగానే మేక‌ప్‌లు వేసుకోవాల్సి ఉంటుంది.

ఇక షూటింగ్‌లో భాగంగా ముద్దులు, కౌగిలింతలు నిషేధం. ఫైట్ స‌న్నివేశాలు కూడా ఇప్పుడు నివారించాల‌ని సూచించారు. ఇప్ప‌ట్లో ఈ స‌న్నివేశాల‌కు అవ‌కాశం లేదు. అదే విధంగా పెళ్లి స‌న్నివేశాలు, మార్కెట్ త‌ర‌హా ర‌ద్దీగా క‌నిపించే సీన్స్‌కు కూడా అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి జాగ్ర‌త్త‌గా షూటింగ్‌లు మ‌హారాష్ట్ర స‌ర్కారు పేర్కొంది. దాదాపు ఇవే మార్గ‌ద‌ర్శ‌కాల్ని మిగ‌తా రాష్ట్రాలూ సూచించే అవ‌కాశ‌ముంది.

This post was last modified on June 2, 2020 1:51 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

3 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

3 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

4 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

6 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

6 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

6 hours ago