మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య ఉన్నది స్నేహమో శతృత్వమో జనాలకు అర్థం కాదు. కొన్నిసార్లు చాలా సన్నిహితంగా కనిపిస్తారు. కొన్నిసార్లు అనుకోని విధంగా వారి మధ్య అంతరం వచ్చేస్తుంటుంది. ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న వీరి మధ్య వజ్రోత్సవాలు చిచ్చు పెట్టడం తెలిసిందే. దాని వల్ల కొన్నేళ్ల పాటు ఇద్దరూ దూరం దూరం అన్నట్లు ఉన్నారు. మళ్లీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గత కొన్నేళ్లలో ఇద్దరూ బాగా దగ్గరైనట్లు కనిపించారు. కానీ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల పుణ్యమా అని మళ్లీ వీరి మధ్య అగాథం మొదలైనట్లు కనిపిస్తోంది.
‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌కు చిరంజీవి మద్దతు ఉందన్నది గట్టిగా జరుగుతున్న ప్రచారం. ప్రకాష్ రాజ్ మీద మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పోటీకి నిలిచారు. చిరు మద్దతుతో ప్రకాష్ రాజ్ బరిలో నిలిచాడని తెలిశాక కూడా విష్ణు పోటీకి సై అన్నపుడే చిరుకు, మోహన్ బాబుకు చెడుతుందనే సంకేతాలు కనిపించాయి.
ఇప్పుడు మోహన్ బాబు మాటల్ని బట్టి చూస్తే చిరుకు, ఆయనకు మధ్య అంతరం వచ్చినట్లు స్పష్టమవుతోంది. దాసరి నారాయణ రావు మరణానంతరం చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదేమీ అధికారిక పోస్టు కాదు కానీ.. అనధికారికంగా ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఉంటున్న మాట వాస్తవం. ఈ హోదాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీలైనంత మేర అందరికీ అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోలో సినిమా పెద్దల గురించి ప్రస్తావించినపుడు.. “ఇప్పుడు సినిమా పెద్దలు ఎవరూ లేరు. దాసరిగారితోనే అది పోయింది” అని మోహన్ బాబు కుండబద్దలు కొట్టారు. “చిరంజీవి ట్రై చేస్తున్నారు కదా” అని అంటే.. “అది నాకనవసరం” అనేశారాయన. దాసరి స్థానాన్ని చిరు భర్తీ చేయలేడా అంటే.. “అది నాకు తెలియదు” అని బదులిచ్చారు. దాసరి పోయాక ఇండస్ట్రీలో పెద్దలు అనే పదమే లేదంటారా అని అడిగితే.. “లేదు లేదు లేదు. రాదు రాదు రాబోదు” అని మోహన్ బాబు తేల్చేశారు.
మంచు విష్ణు నామినేషన్ ఉపసంహరించుకోవాలని చిరు అడిగితే మీరు కాదన్నారట కదా అంటే.. “చిరంజీవి కుటుంబంలోని బిడ్డలెవరైనా నిలబడి ఉంటే.. చిరంజీవి అలా అడిగి ఉంటే వెంటనే విష్ణును విత్ డ్రా చేసుకోమని చెప్పేవాడిని” అని మోహన్ బాబు అన్నారు. ఇదిలా ఉండగా.. మరో ప్రశ్నకు మోహన్ బాబు జవాబిస్తూ.. “ఈ మధ్య ఇది స్నేహమా అనిపించింది. వివరాల్లోకి వెళ్లకండి. అటు రాజకీయంగానూ, సినిమా పరంగానూ జరిగింది. నమ్మకద్రోహం. ఇలా కూడా జరుగుతుంది. ఇలా కూడా ఉంటారా అనిపించింది” అని వ్యాఖ్యానించడం చూస్తే అది చిరును చూశా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘మా’ ఎన్నికల విషయంలో హర్టయే మోహన్ బాబు ఇలా వ్యాఖ్యానించారేమో అనిపిస్తోంది.
This post was last modified on October 4, 2021 10:41 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…