నాలుగేళ్ల కిందట టాలీవుడ్లో డ్రగ్స్ కుంభకోణం ఎంతగా కలకలం రేపిందో తెలిసిందే. మధ్యలో ఆ వ్యవహారం పక్కకు వెళ్లిపోయినా.. ఈ మధ్య ఆ కేసు మళ్లీ జీవం పోసుకుని చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో సైతం ఏడాది కిందట సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతనం డ్రగ్ రాకెట్ ఎంతగా కలకలం రేపిందో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది కాలంలో ఎంతోమంది సినీ ప్రముఖులను డ్రగ్స్ విషయంలో పోలీసులు ప్రశ్నించారు. కొందరిని అరెస్టు కూడా చేశారు.
ఇప్పుడు ఓ ప్రముఖ హీరో కొడుకు డ్రగ్స్ కుంభకోణంలో చిక్కుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరో షారుఖ్ ఖాన్ కావడం గమనార్హం. అతడి కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వాడుతూ పోలీసులకు దొరికిపోయినట్లుగా బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. దీనికి సంబంధించి అంతగా స్పష్టత లేని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.
ముంబయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఏడాది నుంచి బాలీవుడ్ మీద డేగ కన్నేసి ఉండటం తెలిసిందే. ఎన్సీబీకీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉండటంతో పెద్ద పెద్ద వాళ్ల మీద దాడులు చేయడానికి వెనుకాడట్లేదు. ఈ సంస్థ దీన్ని నడిపించే ఒక అధికారికి ముంబయిలోని ఒక ప్రముఖ క్లబ్‌లో డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి తన టీంతో చేరుకుని దాడులు జరిపారు. షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా ఇందులో భాగమని తెలియడంతో.. అతను డ్రగ్స్ తీసుకునే వరకు వేచి చూసి తర్వాత ఎటాక్ చేశారని అంటున్నారు.
రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న ఒక కుర్రాడు ముఖానికి మాస్కుతో పోలీసుల అదుపులోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో శనివారం రాత్రి నుంచి హల్‌చల్ చేస్తోంది. అందులో కనిపిస్తున్నది షారుఖ్ తనయుడు ఆర్యనే అని అంటున్నారు. పోలీకలైతే అలాగే ఉన్నాయి. మరి నిజంగా ఆర్యన్ డ్రగ్స్ వాడుతూ పోలీసులకు దొరికాడా.. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన ఏమైనా చేస్తారా అన్నది చూడాలి.
This post was last modified on October 3, 2021 2:37 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…