మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఆశ పడుతుంటారు. కానీ ఆ అవకాశం కొందరికే వస్తుంది. ఇప్పుడు చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తుండడంతో కొందరు దర్శకులు అతడికి కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి దర్శకుడు పూరి జగన్నాథ్ కి చాలా కాలంగా చిరుతో సినిమా చేయాలనుంది. మెగాస్టార్ 150వ సినిమా పూరి డైరెక్ట్ చేయాల్సింది కానీ ప్రాజెక్ట్ చేజారిపోయింది. ఆ తరువాత కూడా పూరి తన వంతు ప్రయత్నాలు చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు.
అయితే ఇప్పుడు చిరంజీవి నటిస్తోన్న ఓ సినిమాకి తనవంతు సాయం చేస్తున్నాడట పూరి. వివరాల్లోకి వెళ్తే.. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు హీరోగా ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. ఊటీలో ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. చిరు ఈ సినిమా చేస్తున్నాడని పూరికి తెలిసినప్పుడు.. చిరుకి తగ్గట్లుగా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట.
అప్పటికే సినిమా స్క్రిప్ట్ పూర్తయినప్పటికీ పూరి చెప్పిన సజెషన్స్ నచ్చడంతో వాటిని కూడా జోడించి కొత్త సీన్లు రాసుకొని.. దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చినట్లు సమాచారం. చిరుని తెరపై ఎలా చూడాలనుకుంటున్నాడో.. అలాంటి ఎలివేషన్స్, మాస్ సీన్స్ కచ్చితంగా పూరి చెప్పి ఉంటాడు. ఆ విధంగా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పూరి తనవంతు పాత్ర పోషించేశాడు. మరి ఆ సీన్లు తెరపై ఎలా ఉంటాయో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే!
This post was last modified on October 2, 2021 3:58 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…