ఒకప్పటితో పోలిస్తే ఈ తరం ప్రేక్షకుల్లో ‘క్లాస్’ టచ్ ఉన్న సినిమాల్ని ఇష్టపడేవాళ్లే ఎక్కువ కానీ.. మాస్ ప్రేక్షకులను ఎప్పుడూ విస్మరించడానికి వీల్లేదు. వాళ్లను పూర్తిగా మెప్పించే సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆ తక్కువమందిలో బోయపాటి శ్రీను ఒకడు. ఆయన చిత్రాల్లో యాక్షన్‌కు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో తెలిసిందే. హీరోను ఎంతో బలవంతుడిగా చూపిస్తూనే.. అతడికి దీటుగా అత్యంత క్రూరమైన విలన్‌ని పెడుతుంటాడు బోయపాటి.
సింహా, లెజెండ్, సరైనోడు లాంటి చిత్రాల్లో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో తెలిసిందే. బోయపాటి కొత్త చిత్రం ‘అఖండ’లోనూ విలన్ పాత్ర మామూలుగా ఉండదని అంటున్నాడు ఆ క్యారెక్టర్‌ను పోషించిన సీనియర్ నటుడు. ‘అఖండ’లో తన పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని.. ఆ పాత్ర లుక్, దాని పాత్ర చిత్రణ చాలా భయంకరంగా ఉంటాయని శ్రీకాంత్ తెలిపాడు.
“ఇంతకు ముందు బాలయ్యతో ‘శ్రీరామ రాజ్యం’లో తమ్ముడిగా చేశాను. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్‌గా, పవర్ ఫుల్‌గా ఉండే రోల్‌లో కనిపించనున్నా. ‘అఖండ’లో నేను చేస్తున్నది విలన్ పాత్రే. ఆ క్యారెక్టర్లో చాలా కొత్తగా కనబడతా. అసలు ఎవరూ కూడా ఊహించరు నేను అలా ఉంటానని. గెటప్ అంత భిన్నంగా ఉంటుంది. ముంబయి నుంచి ఎన్నో డిజైన్స్ చేయించి ఫైనల్‌గా ఒకటి బోయపాటి ఫిక్స్ చేశారు. పాత్ర చాలా రఫ్‌గా, క్రూరంగా ఉంటుంది. ఆ పాత్రను చూశాక ప్రేక్షకులు నన్ను తిడతారేమో అని కూడా అనిపించింది. బాలయ్య గారు మళ్ళీ ఇలాంటి రోల్ చెయ్యొద్దని నాతో అన్నారు. ఆ రేంజ్‌లో ఈ రోల్ ఉంటుంది. ఇక దీని తర్వాత భయంకరంగా ఆఫర్స్ వస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పారు. అది జాగ్రత్త చెప్పడం మాత్రమే” అని శ్రీకాంత్ అన్నాడు.
మొత్తానికి శ్రీకాంత్ చెబుతున్న తీరు చూస్తే ‘అఖండ’లో అతడి పాత్ర ఓ రేంజిలో ఉండేలా ఉంది. మరి ‘లెజెండ్’తో విలన్ అవతారమెత్తిన జగపతిబాబు ఫుల్ బిజీ అయిపోయినట్లే.. శ్రీకాంత్ కూడా ఆఫర్లలో తడిసి ముద్దవుతాడేమో చూడాలి.
This post was last modified on October 1, 2021 10:37 am
పీక్ సమ్మర్లో థియేటర్లు జనాల్లేక వెలవెలబోతుండడం పట్ల టాలీవుడ్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వేరే ఇండస్ట్రీల పరిస్థితి కూడా ఏమంత…
పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనంటూ TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించుకోవడంతో, ఈ సంస్థ మళ్లీ…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. వందల కోట్ల బడ్జెట్, అంతకుమించిన బిజినెస్ మామూలైపోయింది. ప్రభాస్ ఈ మధ్య చేసిన వాటిలో…
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…