మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలై దాదాపు 20 రోజులు గడుస్తోంది. ఇంకా అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాలేదు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉండటం, కొన్ని రోజులు వెంటిలేటర్ ద్వారా చికిత్స తీసుకోవడం, ఒక శస్త్రచికిత్స కూడా చేయాల్సిన అవసరం పడిందంటే అతడికి అయిన గాయాలు తీవ్రమైనవేనని భావిస్తున్నారు.
మొన్నటి రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తేజు ఇంకా కోమాలోనే ఉన్నాడన్న కామెంట్ అందరినీ అయోమయానికి గురి చేసింది. ఐతే నిజానికి తేజు చాలా రోజుల ముందే తెలివిలోకి వచ్చాడన్నది మెగా ఫ్యామిలీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని తేజుతో రిపబ్లిక్ మూవీ తీసిన దర్శకుడు దేవా కట్టా కూడా ధ్రువీకరించాడు. రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను తేజు చూసినట్లు దేవా చెప్పడం గమనార్హం.
యాక్సిడెంట్ అయ్యాక తాను తేజును కలిసినట్లు దేవా కట్టా వెల్లడించాడు. అక్టోబర్ 1న సినిమాను విడుదల చేద్దామని తనతో మాట్లాడుకున్న తర్వాతే ఫైనల్‌గా ఓకే చేశామని.. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్‌ను తేజు చూశాడని దేవా చెప్పాడు. తేజు ఆరోగ్యం మెరుగు పడ్డప్పటికీ.. అతను నూటికి నూరుశాతం ఓకే అనుకునే వరకు ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని భావించి ఆసుపత్రిలోనే కొనసాగుతున్నట్లు దేవా చెప్పాడు.
తేజు త్వరగా కోలుకుంటున్నాడని.. మాట్లాడుతున్నాడని.. కాస్త కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నాడని.. అతను పూర్తిగా రికవర్ కావడానికి మరికొంత సమయం పడుతుందని దేవా వెల్లడించాడు. దేవా చెప్పిన మాటల్ని బట్టి ఇక తేజు ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేనట్లే. అతను ప్రి రిలీజ్ ఈవెంట్ చూశాడంటే.. పవన్ కళ్యాణ్ ఫైర్ బ్రాండ్ స్పీచ్‌ను కూడా వీక్షించాడన్నమాటే. మరి కోలుకున్నాక దీనిపై అతనెలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on September 29, 2021 12:20 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…