ఇప్పుడు తమన్ ఉన్న ఊపులో ఇండియాలో మరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా లేడు అంటే అతిశయోక్తి కాదు. సినిమా సంఖ్య పరంగా చూసినా, వాటి స్థాయి పరంగా చూసినా ఎవరూ అతడికి దరిదాపుల్లో లేరు. ఏక కాలంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి బడా స్టార్ల సినిమాలకు సంగీతం అందించడమంటే మామూలు విషయం కాదు.
ప్రతి సంగీత దర్శకుడికీ ఫలానా స్టార్ సినిమాకు, ఫలానా అగ్ర దర్శకుడి చిత్రానికి సంగీతం అందించాలని కొన్ని కలలు ఉంటాయి. కానీ కొందరే వాటిని నెరవేర్చుకుంటాడు. తమన్ అలా గత కొన్నేళ్లలో చాలా కలలే నెరవేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులతో పని చేశాడు. తాజాగా సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ కూడా పట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ తీయబోయే సినిమాకు తమనే సంగీత దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తమన్ మరో కల నెరవేరే సమయం వచ్చినట్లు సమాచారం. అతను తొలిసారిగా ఇళయ దళపతి విజయ్ సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నాడట. తమన్ తమిళంలోనూ కొన్ని సినిమాలు చేశాడు కానీ.. తెలుగులో మాదిరి అక్కడ పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం తమిళంలో విజయే నంబర్ వన్ హీరో.
సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టేసి తిరుగులేని రేంజికి చేరుకున్నాడు. విజయ్‌తో సినిమా చేయాలన్న ఆశను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీర్చేస్తున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమాను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి తమన్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేశారట. ఇరు భాషల ప్రేక్షకులకూ నచ్చే సంగీతం ఇవ్వగల, మంచి ఫామ్‌లో ఉన్న తమనే ఈ సినిమాకు కరెక్ట్ అని ఫీలయ్యి అతడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ బిగ్ ఛాన్స్‌ను తమన్ ఎంత బాగా ఉపయోగించుకుంటాడో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates