స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. త్వరలోనే మరో సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప’ సినిమా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని సెప్టెంబర్ లోపు పూర్తి చేసి.. మిగిలిన ప్యాచ్ వర్క్ చేసుకొని డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదీ జరగడం లేదట. మరో నెల రోజులకు పైగా చేయాల్సిన షూటింగ్ పెండింగ్ ఉందట. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అది కాకుండా మరో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీటితో పాటు యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరించాల్సివుంది.
ఎలా చూసుకున్నా.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసరికి నవంబర్ వచ్చేస్తుంది. అందుకే మేకర్స్ మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. రష్మిక మందనా హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on September 28, 2021 2:28 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…