Movie News

పవన్ వల్ల ఏం ఒరిగింది?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత హైప్ తెచ్చుకున్న ‘లవ్ స్టోరి’ మూవీ గత వారాంతంలోనే విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టుకుంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఒకప్పటిలా కళకళలాడాయి. డివైడ్ టాక్, బంద్, వర్షాల కారణంగా వీకెండ్ తర్వాత జోరు ఈ సినిమా జోరు బాగా తగ్గింది.

దీంతో ఇక ఫోకస్ ఆటోమేటిగ్గా ఈ వారాంతంలో విడుదల కానున్న ‘రిపబ్లిక్’ మీదికి మళ్లుతోంది. ఐతే ఈ సినిమాకు ఇప్పటిదాకా అయితే అనుకున్నంత హైప్ లేదు. బేసిగ్గా ఇది సీరియస్ మూవీ కావడం కొంత మైనస్సే. సామాజిక, రాజకీయ అంశాల చుట్టూ దేవా కట్టా చాలా సిన్సియర్‌గా ఈ సినిమా తీసినట్లున్నాడు.

ఐతే కంటెంట్ మరీ సీరియస్‌గా ఉండటంతో యువ ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు. ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసి సినిమాకు హైప్ పెంచాల్సిన టైంలో హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రికి పరిమితం కావడం మైనస్ అయింది.

ఐతే ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్ కొంచెం గట్టిగా చేసి హైప్ పెంచాలనుకున్నారు. ఇందుకోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా పిలిపించారు కూడా. కానీ ఆయన ఆ వేడుకలో పూర్తిగా రాజకీయాల మీద మాట్లాడి ఫోకస్ మళ్లించేశాడు. ఈ వేడుక అయ్యేసరికి అందరూ ‘రిపబ్లిక్’ గురించి మరిచిపోయారు.

పూర్తిగా పవన్ చేసిన రాజకీయ వ్యాఖ్యల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఈ వేడుకకు పవన్ ప్లస్ అవుతాడనుకుంటే.. ఈ వేడుకే పవన్‌కు ప్లస్ అయింది. పవన్ వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మీడియాను కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఎంతైనా ఒక సినిమా రిలీజ్ ముంగిట దాని హీరో మీడియా ముందుకొస్తే వచ్చే హైప్ వేరని రుజువవుతోంది.

యాక్సిడెంట్ తర్వాత తేజు ఈపాటికి కోలుకుని మీడియాను కలిసి ఉంటే మీడియా దృష్టి మొత్తం అతడి చుట్టూ, తన సినిమా చుట్టూ తిరిగేది. అతను లేకపోడవడం మైనస్ అవుతోంది. మరి లో బజ్‌తో రిలీజవుతున్న ‘రిపబ్లిక్’ ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

This post was last modified on September 28, 2021 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

53 minutes ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

1 hour ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

2 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

4 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

4 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

4 hours ago