టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ భారీ చిత్రంతో హిందీలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే.. లాల్ సింగ్ చద్దా. ఇందులో అరగంటకు పైగా నిడివి ఉన్న ప్రత్యేక పాత్రను చేస్తున్నాడు నాగచైతన్య. ఇందుకోసం నెలన్నర పాటు షూటింగ్‌లో పాల్గొని వచ్చాడు.
ఇందులో అతను చేస్తున్నది సైనికుడి పాత్ర అన్నది రివీలైంది. ఈ పాత్రకు సంబంధించి మొత్తం లడ్డక్‌లో చిత్రీకరణ జరిగింది. ఇందులో చైతన్య పాత్రకు ఆసక్తికరమైన పేరు పెట్టారు. ఆ పేరు అక్కినేని అభిమానులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేదే. తన పాత్ర పేరు బాలరాజు అట.
ఈ పేరుతో అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ ఆరంభంలో ఒక క్లాసిక్ మూవీ చేశాడు. ఆయన పూర్తి స్థాయిలో కథానాయకుడిగా నటించిన తొలి చిత్రమిది. దీని గురించి ఎప్పుడు మాట్లాడినా ఎగ్జైట్ అయ్యేవారు ఏఎన్నార్.
ఇప్పుడు ఏఎన్నార్ కెరీర్లో మరపురాని పాత్ర పేరును చైతూ పాత్రకు పెట్టడం.. అందులోనూ అది హిందీ డెబ్యూ మూవీ కావడంతో చైతూ కంటే కంటే అతడి తండ్రి నాగార్జున చాలా ఎగ్జైట్ అవుతున్నట్లు.. భావోద్వేగానికి గురవుతున్నట్లు సమాచారం. ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్లో ‘బబ్బా’ అనే ఆసక్తికరమైన పాత్ర ఉంటుంది. సైన్యంలోకి అడుగు పెట్టిన హీరోకు అక్కడ దొరికే ఏకైక స్నేహితుడు బబ్బానే. కాస్త చిత్రమైన హావభావాలతో అమాయకంగా కనిపిస్తాడు. అతడి కంపెనీని హీరో ఎంతో ఇష్టపడతాడు. ఆర్మీ నుంచి రిటైరయ్యాక పెద్ద ఓడ కొనుక్కుని దాని ద్వారా సముద్రంలో చేపలు పట్టాలన్నది అతడి కల. కానీ అతడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఈ సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి.
హీరో సైన్యం నుంచి నిష్క్రమించాక బబ్బా కలను నెరవేరుస్తాడు. సినిమాలో ఈ పాత్ర ఉండేది అటు ఇటుగా అరగంటే కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా కొనసాగుతుంది. చైతూ ఈ పాత్రలోనే నటిస్తున్నాడని తెలుస్తోంది.
This post was last modified on September 26, 2021 10:36 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…