తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రానే వచ్చింది. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన ఆ చిత్రమే.. లవ్ స్టోరి. నాగచైతన్య, సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులను పూర్తి స్థాయిలో థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాగా దీనిపై ఆశలు పెట్టుకుంది టాలీవుడ్. ఆ అంచనాలను ఈ సినిమా పూర్తిగా అందుకుంది.
తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్యాక్డ్ హౌస్‌లతో నడుస్తోంది లవ్ స్టోరి. ఒక భారీ చిత్రం స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి. ఇక రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర హడావుడి మామూలుగా లేదు. నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా లవ్ స్టోరి నిలవడం లాంఛనమే. మిడ్ రేంజ్ సినిమాల్లో ఈ చిత్రం కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశమూ ఉంది.
ఇక యుఎస్ బాక్సాఫీస్‌లో లవ్ స్టోరి ప్రకంపనలే రేపుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత అత్యధిక ప్రిమియర్ వసూళ్లు సాధించిన చిత్రంగా లవ్ స్టోరి రికార్డు నెలకొల్పడం విశేషం. ఇప్పటిదాకా ఆ రికార్డు పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ పేరిట ఉంది. గత ఏడాది మార్చిలో కరోనా ప్రభావం మొదలయ్యాక ఇప్పటి వరకు విడుదలైన ఏకైక బిగ్ స్టార్ మూవీ అది. యుఎస్‌లో ప్రిమియర్స్ ద్వారా ఆ చిత్రం 3 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడా వసూళ్లను లవ్ స్టోరి అధిగమించింది.
ఈ చిత్రానికి గురువారం ప్రిమియర్ల ద్వారా 3.06 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. యుఎస్‌లో కరోనా ధాటికి ఇండియన్ సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తినేసిన టైంలో ఈ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనూహ్యం. ఈ ఏడాది యుఎస్‌లో సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక ప్రిమియర్ వసూళ్లు సాధించిన చిత్రంగానూ లవ్ స్టోరి రికార్డు నెలకొల్పడం విశేషం.
This post was last modified on September 25, 2021 7:48 am
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…