కొన్నేళ్ల పాటు ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా మంచి హోదా అనుభవించి.. ఆ తర్వాత కూడా ప్రముఖ వ్యాపారవేత్తగా చెలామణి అవుతూ వచ్చిన రాజ్ కుంద్రా.. కొన్ని నెలల కిందట పోర్న్ మూవీస్ తీస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న రాజ్.. సోమవారమే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. కాగా అతను బెయిల్ మీద వచ్చిన సమయంలోనే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తన గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు.
విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్, లాప్‌టాప్, హాట్‌డ్రైవ్ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కలిపి రాజ్ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు కూడా తెలిపారు. ఏకంగా 100 ప్లస్ సంఖ్యలో పోర్న్ సినిమాలు నిర్మించాడంటే.. రాజ్ ఏ స్థాయిలో ఈ దందాను నడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. తాము నిర్మించినవి పోర్న్ సినిమాలు కావని.. కొంచెం శృంగారభరితంగా ఉన్న వీడియోలు మాత్రమే అని రాజ్ సమర్థించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్ షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. కుంద్రా వ్యవహారాల గురించి తనకు ఏమీ తెలియదని అంటున్న అతడి భార్య శిల్పా శెట్టి.. తాజా పరిణామాల నేపథ్యంలో అతడి నుంచి విడిపోవాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 21, 2021 4:49 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…