కొన్ని వారాల కిందట ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ రిలీజైనపుడు దగ్గుబాటి రానా గురించి చాలా మంది రకరకాలుగా ఫీలైపోయారు. ఈ సినిమా ఒరిజినల్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో లీడ్ రోల్స్ చేసిన ఇద్దరు నటులకూ సమాన ప్రాధాన్యం కనిపిస్తుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్‌ను హైలైట్ చేయడం కోసం రానా పాత్రకు బాగా ప్రాధాన్యం తగ్గించేశారన్న ఫీలింగ్ కలిగింది చాలామందికి. టైటిల్లో రానా పాత్ర పేరు రాకుండా ‘భీమ్లా నాయక్’ అని పవన్ క్యారెక్టర్ నేమ్ ఒకటే పెట్టడంతోనే అన్యాయం జరిగిపోయిందని అన్నారు.
ఇక ఫస్ట్ టీజర్లోనూ రానాకు స్కోప్ లేకుండా పవన్ మీదే తీర్చిదిద్దడం.. ఆ తర్వాత ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. రానా ఈ సినిమా ఒప్పుకుని తప్పు చేశాడని అతడి ఫ్యాన్స్ ఫీలవడం.. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ వారిని మరింత రెచ్చగొట్టడం కనిపించింది సోషల్ మీడియాలో.
ఐతే లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన డానియల్ శేఖర్ క్యారెక్టర్ టీజర్ చూశాక ఆ సందేహాలన్నీ పటాపంచలు అయిపోయాయి. భీమ్లా నాయక్ టీజర్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో, ఇంకా చెప్పాలంటే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఈ టీజర్‌ను తీర్చిదిద్దారు. భీమ్లా టీజర్ పూర్తిగా పవన్ ఆకర్షణ మీద నడిచింది. కానీ డానీ క్యారెక్టర్ టీజర్లో ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా కనిపించింది. రానా స్క్రీన్ ప్రెజెన్స్.. అతడి లుక్స్.. యాటిట్యూడ్ కూడా బాగా ప్లస్ అయ్యాయి. రానా టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు.
24 గంటల్లోపే 5 మిలియన్ వ్యూస్ దాటేసింది ఈ టీజర్‌కు. పవన్ ముందు రానా ఏం నిలుస్తాడులే అనుకున్న వాళ్లకు అతడి సత్తా ఏంటో తెలుస్తోంది. రానా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపున్న నటుడు కావడంతో ఈ టీజర్‌కు రెస్పాన్స్ కూడా ఓ రేంజిలో ఉంది. నిన్నటిదాకా రానా గురించి తక్కువ అంచనా వేసిన వాళ్లు, అతడి టీజర్ విషయంలో లైట్ అన్న వాళ్లందరూ కూడా ఇప్పుడు అభిప్రాయం మార్చుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్, రానా మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 21, 2021 3:50 pm
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…