ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఒక తెలుగు సినిమాకు సంబంధించిన వేడుకలో పాల్గొంటాడని ఎప్పుడైనా ఊహించామా? కానీ ఈ ఆదివారం ఈ ఆశ్చర్యకర దృశ్యం చూడగలిగాం. అక్కినేని నాగచైతన్య ఈ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ ఓ ప్రత్యేక పాత్ర పోషించడం.. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడటం.. చైతూపై ఆమిర్‌కు చాలా మంచి అభిప్రాయం ఏర్పడటంతో తన కోసం హైదరాబాద్ వరకు వచ్చి ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు ఆమిర్.
ఐతే ఆమిర్‌తో పెరిగిన పరిచయాన్ని ఉపయోగించుకుంటూ.. కొంచెం మొహమాటంగా అయినా చైతూనే తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన్ని ఈ ఈవెంట్‌కు రప్పించి ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. స్వయంగా ఆమిర్ ఖాన్ తనంతట తాను ఈ వేడుకకు వచ్చాడు. ఈ విషయాన్ని ఇటు ఆమిర్, అటు చైతూ ధ్రువీకరించారు కూడా.
మూణ్నాలుగు రోజుల కిందట తాను ‘లవ్ స్టోరి’ ట్రైలర్ చూశానని.. అది తనకు చాలా నచ్చిందని.. దీంతో తనకు తానుగా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని ఆమిర్ చెప్పాడు. నాగచైతన్య మంచి నటుడే కాదు.. ఎంత మంచి వ్యక్తో అతడి తల్లిదండ్రులతో పాటు అభిమానులందరికీ చెప్పాలన్న ఉద్దేశం కూడా తాను ఇక్కడికి రావడానికి కారణమని ఆమిర్ తెలిపాడు.
మరోవైపు చైతూ మాట్లాడుతూ.. ‘లవ్ స్టోరి’ ట్రైలర్ చూసి ఆమిర్ తనకు మెసేజ్ పంపాడని.. అప్పుడే క్యాజువల్‌గా ఈ ఆదివారం ఎక్కడుంటావని అడిగాడని.. ఇలా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఉందని తాను చెప్పానని.. అలా చెప్పగానే తాను ఆ ఈవెంట్‌కు వస్తానని ఆమిర్ అన్నాడని.. ఆయన ఈ వేడుకలో పాల్గొనడం ఇంకా నమ్మలేక పోతున్నానని చైతూ చెప్పాడు. ‘లాల్ సింగ్ చద్దా’ కోసం 45 రోజుల పాటు ఆమిర్‌తో పని చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని.. ఈ అనుభవం తన జీవితాంతం ఒక పాఠంగా ఉపయోగపడుతుందని చైతూ అన్నాడు.
This post was last modified on September 20, 2021 7:20 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…