Movie News

చై-సామ్ మాట్లాడరు.. అర్థం చేసుకోవాలంతే

దాదాపు నెల రోజుల నుంచి టాలీవుడ్లో అక్కినేని నాగచైతన్య-సమంతల బంధం గురించే చర్చ. ప్రేమించి పెళ్లి చేసుకుని మూడేళ్లకు పైగా వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని.. ఇద్దరూ విడిపోతున్నారని.. విడాకులకు సిద్ధమయ్యారని.. ఇద్దరినీ కలపడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నమ్మనూ లేదు. కానీ తర్వాతి పరిణామాలు చూశాక నెమ్మదిగా విషయం స్పష్టమవుతూ వచ్చింది.

సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరులోంచి ‘అక్కినేని’ అని తీసేసి ‘ప్రభు’ అని తండ్రి పేరు పెట్టుకోవడంతోనే సమంత అసలేం జరుగుతోందన్నది స్పష్టం చేసేసిందని చెప్పొచ్చు. చైతూకు ఆమె దూరం అవుతోందనడానికి మరిన్ని రుజువులు కనిపించాయి.

ఐతే చైతూ, సమంత మీడియా ముందుకు రాకపోరు. తమ బంధం విషయంలో ఏం జరుగుతోందో క్లారిటీ ఇవ్వకుండా పోరు అని అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఆ సందర్భాలు వచ్చినా కూడా స్పష్టత రాలేదు. ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు రాబోతూ.. చైతూ చాలా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు వేయకూడదని పీఆర్వోల ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఆల్రెడీ ప్రమోషన్లలో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడిన చైతూ.. సమంత గురించి ప్రశ్నలు రాకుండా చూసుకున్నాడు. రేప్పొద్దున ప్రెస్ మీట్ పెట్టినా చైతూ నుంచి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశమే లేదు.

మరోవైపు సమంత సైతం తిరుమలలో మీడియా వాళ్లు ఈ విషయం అడిగితే సీరియస్ అయింది. ఆమెకు కూడా ఈ విషయంపై స్పందించే ఉద్దేశం లేదని అర్థమవుతోంది. బహుశా ఇద్దరూ పూర్తిగా విడిపోయే వరకు ఈ విషయంపై మాట్లాడొద్దని అనుకుంటున్నారా.. లేక మధ్యలో వీరిని కలపడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతుండటం వల్ల సైలెంటుగా ఉంటుున్నారా అన్నది తెలియడం లేదు. కాబట్టి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందని మాత్రం జనాలు అర్థం చేసుకోవాలి. అక్టోబరు 7న వీరి పెళ్లి రోజు రానుంది కాబట్టి ఆ రోజు వీరెలా వ్యవహరిస్తారన్న దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చేమో.

This post was last modified on September 19, 2021 3:45 pm

Share

Recent Posts

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

16 minutes ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

25 minutes ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

1 hour ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

3 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

5 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

7 hours ago