మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ కేరళలో రిలీజైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు తీసేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో లీడ్ రోల్స్ ఎవరితో చేయించాలనే విషయంలో చాలా సందిగ్ధతే నడిచింది. రకరకాల పేర్లు వినిపించాయి. చివరికేమో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలకు ఖరారయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో సందిగ్ధత మొదలైంది. ముందు పవన్‌కు జోడీగా సాయిపల్లవి అన్నారు. తర్వాత ఆమె తప్పుకుంటే నిత్యా మీనన్‌తో ఆ పాత్రను రీప్లేస్ చేశారు.
ఇక రానాకు జోడీగా ముందు వినిపించిన పేర్లు వేరు. చివరికి తమిళ హీరోయిన్ అయిన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను ఎంచుకున్నారు. ఈమెతో కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు.
ఐశ్వర్య స్థానంలోకి మలయాళ అమ్మాయి సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది నిజమే కావచ్చు. అసలు ఈ సినిమా చేయడానికి ఐశ్వర్య ఎలా ఒప్పుకుందన్నదే అర్థం కాని విషయం. తమిళంలో కథానాయికగా ఆమెకు మంచి పేరుంది. చాలా వరకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసింది తను. ‘కనా’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ సత్తా చాటింది. అలాంటి అమ్మాయి రానాకు జోడీగా కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రకు ఒప్పుకోవడమే ఆశ్చర్యం.
ఒరిజినల్ చూసిన వాళ్లకు ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థమై ఉంటుంది. చాలా నామమాత్రమైన క్యారెక్టర్ అది. అలాంటి పాత్రను ఐశ్వర్య చేయాల్సిన అవసరమే లేదు. ఐతే ఇందులో నిత్యా మీనన్ చేసిన పాత్రకు ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఓవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న నిత్య అలాంటి పాత్ర చేస్తుంటే.. మంచి ఊపులో ఉన్న ఐశ్వర్య ప్రాధాన్యం లేని పాత్ర చేయాల్సిన అవసరమే లేదు. అందుకే కొంచెం లేటుగా అయినా ఐశ్వర్య సరైన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి.
This post was last modified on September 19, 2021 3:29 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…