Movie News

పాన్ ఇండియా.. అంత సీనుందా?


పాన్ ఇండియా.. ‘బాహుబలి’ రిలీజైన దగ్గర్నుంచి ఫిలిం ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన మాట ఇది. ఏదో ఒక భాషలో కాకుండా ముఖ్యమైన భారతీయ భాషల్లో తెరకెక్కి దేశవ్యాప్తంగా రిలీజయ్యే సినిమాలను ‘పాన్ ఇండియా’ సినిమాలని అంటున్న సంగతి తెలిసిందే. ఐతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా.. ‘బాహుబలి’ని చూసి అత్యాశతో చాలామంది పాన్ ఇండియా సినిమాలు మొదలుపెట్టారు.

ఐతే వీటిలో చాలా వరకు పేరుకే పాన్ ఇండియా సినిమాలు. ఒక భాషలో తీసి మిగతా భాషల్లో అనువాదం చేయడం తప్పితే.. వేర్వేరు భాషల్లో ఏమీ సినిమా తీయట్లేదు. ఇక రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి బేసిగ్గా ఏ భాషలో తెరకెక్కిందో అక్కడ మాత్రమే సినిమా పెద్ద స్థాయిలో రిలీజవుతోంది. మిగతా భాషల్లో రిలీజ్, వసూళ్లు నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ కోవలో చాలా సినిమాలు చూడొచ్చు. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. ఘనంగా పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా తెలుగులో ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘హనుమాన్’ సినిమాను కూడా ‘పాన్ ఇండియా’ జాబితాలో కలిపేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ ఇప్పటిదాకా రూపొందించిన మూడు చిత్రాల్లో పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా ఒక్కటీ లేదు. ‘అ!’ వినూత్న చిత్రంగా ప్రశంసలందుకున్నా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ‘కల్కి’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరుగా ఆడింది. ఆ చిత్ర హీరో తేజతోనే ‘హనుమాన్’ తీస్తున్నాడు ప్రశాంత్.

ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులనే పూర్తిగా మెప్పించే సినిమా తీయని ప్రశాంత్.. ఇప్పుడు ‘హనుమాన్’ను పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేయడం పట్ల కౌంటర్లు పడుతున్నాయి. ‘పాన్ ఇండియా’ అంటే అందరికీ కామెడీ అయిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ‘హనుమాన్’తో ప్రశాంత్ వీళ్లకు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

This post was last modified on September 18, 2021 7:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

8 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

9 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago