పలాస 1978 సినిమాతో ఆశ్చర్యానికి గురి చేసిన నటుడు రక్షిత్. అంతకుముందే అతను లండన్ బాబులు అనే సినిమాలో నటించాడు. ఓ తమిళ హిట్ మూవీకి రీమేక్ అయిన అది మంచి సినిమానే అయినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. తర్వాత అతను పలాస మూవీ చేశాడు. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉండగా ఎవరికీ అంతగా పట్టలేదు. కానీ రిలీజ్ ముంగిట ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
అన్ సీజన్లో రిలీజ్ కావడం, సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల దీనికి థియేటర్లలో ఆశించిన స్పందన రాలేదు కానీ.. ఓటీటీలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే చూశారు. రక్షిత్ నటనకు అన్ని వైపులా ప్రశంసలు లభించాయి. ఓ కొత్త నటుడు ఇంత వెయిట్ ఉన్న పాత్రను బాగా చేశాడన్న కితాబులు దక్కాయి. ఇప్పుడీ నటుడు టైం తీసుకుని తన కొత్త చిత్రాన్ని లైన్లో పెట్టాడు. అదే.. శశివదనే.
సాయిమోహన్ ఉబ్బాన అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న శశివదనే ప్రి టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఆర్టిస్టులను చూపించకుండా అందమైన పల్లెటూరి వాతావరణంలో విజువల్స్ చూపిస్తూ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థమయ్యేలా ఇద్దరు పాత్రధారుల మాటలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని ప్రేమించావు కదా.. ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకున్నా కూడా వాళ్లింట్లో వాళ్లను ఎలా ఒప్పిస్తావని హీరోను అడిగితే.. కులం వేరైతే ఒప్పుకోరు, ఒకే కులం అయితే స్థాయి తక్కువ అంటారు.. అయినా కులం చూసి ప్రేమిస్తామా.. ప్రేమించాక అందుకోసం పోరాటం తప్పనిసరి అనడంతో ఈ టీజర్ ముగిసింది.
కులం అడ్డుగోడల విషయంలో అంబేద్కర్ కోట్స్ చూపించడం.. హీరో వ్యాఖ్యానాన్ని బట్టి ఇది కులం చుట్టూ తిరిగే ప్రేమకథలా అనిపిస్తోంది. చూస్తుంటే పలాస తరహాలోనే రక్షిత్ మరో హార్డ్ హిట్టింగ్ మూవీ చేస్తున్నట్లున్నాడు. ఇంతకుముందు అక్షర మూవీని నిర్మించిన అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on September 16, 2021 7:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…