Movie News

‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?


యువ కథానాయకుడు నితిన్ కొత్త సినిమా ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన ఈ చిత్రాన్ని హాట్ స్టార్ ఓటీటీ స్ట్రీమ్ చేయబోతోంది. ఐతే ఓటీటీల్లో వచ్చే సినిమాల రిలీజ్ టైమింగ్ తెలియక జనాలు తికమక పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కో ఓటీటీ ఒక్కోలా వ్యవహరిస్తుంటుంది. అమేజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్‌కు ముందు రోజే రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య స్ట్రీమింగ్ మొదలు పెడుతుంటుంది. మొన్న ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఏడు గంటలకే రిలీజ్ చేసేశారు.

హాట్ స్టార్ వాళ్లకు ఒక నిర్దిష్టమైన టైమింగ్ అంటూ ఉండదు. రిలీజ్ రోజు ఉదయం, మధ్యాహ్నం, ముందు రోజు అర్ధరాత్రి ఇలా రకరకాల టైమింగ్స్‌లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. దీంతో ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ టైం విషయంలో ప్రేక్షకులకు స్పష్టత కొరవడింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్ చేయబోతున్నట్లు సమాచారం.

శుక్రవారం ‘గల్లీ రౌడీ’ మూవీ థియేటర్లలో రిలీజవుతుండటంతో ఉదయం లేదా మధ్యాహ్నం తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుండదని.. ముందు రోజు అర్ధరాత్రే స్ట్రీమింగ్ మొదలుపెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓటీటీ రిలీజ్ అయినా సరే.. ఒక రేంజిలో ‘మాస్ట్రో’కు ప్రమోషన్లు చేస్తున్న చిత్ర బృందం.. ఇంకో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రాన్ని థియేట్రికల్ ప్రిమియర్ ప్లాన్ చేసింది. గురువారం రాత్రి 8.30కి ప్రెస్, ఫిలిం సెలబ్రెటీలకు హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో ప్రిమియర్ షో ప్లాన్ చేశారు.

ఇలా ఒక ఓటీటీ సినిమాకు థియేట్రికల్ ప్రిమియర్ వేయడం టాలీవుడ్లో తొలిసారి అనే చెప్పాలి. అంటే ఓటీటీ షో పడటానికి ముందు ‘మాస్ట్రో’ టాక్ బయటికి వచ్చేస్తుందన్నమాట. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ట్రో’ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా, నభా నటేష్, నరేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

This post was last modified on September 16, 2021 2:18 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

11 hours ago