నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘టక్ జగదీష్’ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు ఆ మధ్య ఎంత రభస జరిగిందో అంతా చూశారు. ఈ విషయంలో నాని, నిర్మాతలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తమకు ఏది ఎక్కువ ప్రయోజనకరమో చూసుకుని ఈ ఒప్పందం చేసుకున్న నిర్మాతలను తప్పుబట్టడానికి లేకపోయింది. కొన్ని రోజుల తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. అనుకున్నట్లే వినాయక చవితి కానుకగా ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సరే.. ఇది గట్టిగానే నిలబడింది.
ప్రైమ్‌లో అంచనాల్ని మించి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. తెలుగు ఓటీటీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసినట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. తొలి రోజు అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న, అలాగే ఓవరాల్‌గా అత్యధిక వ్యూస్ మార్కును దాటేసిన చిత్రంగా ‘టక్ జగదీష్’ రికార్డు నెలకొల్పడం విశేషం.
‘టక్ జగదీష్’ను ఓటీటీలో రిలీజ్ చేయడం అత్యుత్తమన నిర్ణయం.. దీని వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమాను మంచి రేటుకు అమ్ముకుని నిర్మాతలు లాభపడ్డారు. ఈ చిత్రాన్ని కొన్ని అమేజాన్ ప్రైమ్ కూడా వచ్చిన స్పందన పట్ల సంతోషంగా ఉంది. వాళ్లు పెట్టిన రేటు గిట్టుబాటు అయినట్లే. ఒక వేళ ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే మాత్రం కచ్చితంగా బయ్యర్లకు పంచ్ పడేదన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే మూస ధోరణిలో, సాగతీతగా అనిపించిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే కథ వేరుగా ఉండేది.
ఓటీటీలో అయితే సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా జనాలు సర్దుకుపోతారు కానీ.. టికెట్ కొని థియేటర్‌కు వెళ్లి సినిమా చూసినపుడు తేడా కొడితే స్పందించే తీరు వేరుగా ఉంటుంది. కచ్చితంగా అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. రివ్యూలు కూడా ఇలా ఉండేవి కావేమో. ప్రస్తుతం థియేటర్లలో రిలీజవుతున్న ఏ సినిమాకూ ఆశించిన స్పందన రావట్లేదు. కాబట్టి ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం తప్పకపోయేది. బయ్యర్లు దెబ్బ తినేవాళ్లు. నాని ఖాతాలో ఒక ‘ఫ్లాప్’ జమ అయ్యేది. అది అతడి మార్కెట్‌పై ప్రభావం చూపేది. నిర్మాతలకు కూడా తంటాలు తప్పేవి కావు. కాబట్టి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి మంచి పని చేశారని అనుకోవచ్చు. మొత్తంగా ఓటీటీ రిలీజ్‌తో ఆల్ హ్యాపీస్ అన్నట్లే ఉంది పరిస్థితి.
This post was last modified on %s = human-readable time difference 3:25 pm
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…