రకుల్ కాంట్రవర్శియల్ సినిమా ఆగిపోయింది!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే.. మరోపక్క హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతోంది. ఈ క్రమంలో తనకు ఏదైనా కథ కొత్తగా అనిపిస్తే వెంటనే ఒప్పేసుకుంటోంది. ఇలానే ‘ఛత్రివాలి’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇందులో ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించడానికి రెడీ అయింది.

ఈ విషయం తెలిసినప్పుడు ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. ఇలాంటి బోల్డ్ రోల్ లో రకుల్ ఎలా నటిస్తుందోనని అనుకున్నారు. దర్శకుడు తేజస్ విజయ్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు సోషల్ మీడియాలో రకుల్ పై ట్రోలింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మరిన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన ఆయన ప్రాజెక్ట్ ను ఆపేసినట్లు తెలుస్తోంది.

మరి దర్శకుడు తేజస్ కొత్త ప్రొడ్యూసర్ ను వెతుక్కుంటాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే. మరోపక్క రకుల్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. దాదాపు అరడజనుకి పైగా బాలీవుడ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నారు. అలానే తెలుగులో ఆమె నటించిన ‘కొండపొలం’ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశాడు.