పవన్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్!

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ అనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు విష్ణవర్ధన్. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో దర్శకుడి మరో ఛాన్స్ రాలేదు. దీంతో టాలీవుడ్ కి దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి ఆయన టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. రీసెంట్ గా విష్ణువర్ధన్ బాలీవుడ్ లో ‘షేర్షా’ అనే సినిమాను తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో తెలుగు సినిమా నిర్మాతల దృష్టి విష్ణువర్ధన్ పై పడింది.

అతడు ‘పంజా’ అనే భారీ డిజాస్టర్ సినిమా ఇచ్చాడని మర్చిపోయారు. ‘షేర్షా’ లాంటి హిట్టు సినిమా తీయడంతో మరోసారి ఆయన్ను టాలీవుడ్ కి తీసుకురావాలనుకుంటున్నారు. హీరోని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తో విష్ణువర్ధన్ సినిమా చేయబోతున్నారట. అయితే నిర్మాత ఎవరనేది మాత్రం ఇంకా డిస్కషన్ జరుగుతోంది.

నిజానికి విష్ణువర్ధన్ దగ్గర ఓ నిర్మాతకు సంబంధించిన పాత అడ్వాన్స్ ఉంది. వైష్ణవ్ తేజ్ డేట్ లు వేరే నిర్మాత దగ్గర ఉన్నాయి. దానికి వలన నిర్మాతగా ఎవరు ఫిక్స్ అవుతారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయం పక్కన పెడితే.. ‘పంజా’ డైరెక్టర్ మళ్లీ ఇంతకాలానికి తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి ఈసారైనా ఇండస్ట్రీ హిట్ అందుకుంటారేమో చూడాలి!