రొటీన్ మాస్ మసాలా, ఫార్ములా సినిమాలు చేయడానికి టాలీవుడ్లో చాలామంది హీరోలున్నారు. ముఖ్యంగా వారసత్వంతో వచ్చి స్టార్లు అయిన చాలామంది హీరోలకు మాస్ సినిమాలే ఆధారం. వాళ్లకు ఆ సినిమాలతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ప్రయోగాలు చేసినా, కొత్తగా ఏదైనా ట్రై చేసినా రిస్క్ ఎక్కువ ఉంటుంది.
అదే సమయంలో కొందరు హీరోలు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తేనే బాగుంటుంది. ముందు నుంచి వాళ్లు భిన్నమైన సినిమాలే చేయడం వల్ల ప్రేక్షకులు అలాంటివే ఆశిస్తారు. అలాంటి హీరోలు రొటీన్ బాట పడితే ప్రేక్షకులకు రుచించదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కష్టపడి స్టార్‌గా ఎదిగిన నాని ఈ కోవకే చెందుతాడు. నాని సినిమా అంటే ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని.. అతను మూస సినిమాలు చేయడని బలమైన అభిప్రాయం జనాల్లో ఉంది.
కానీ గత కొన్నేళ్ల నుంచి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించే క్రమంలో నాని తన పేరును చెడగొట్టుకుంటున్నాడు. కొన్నేళ్ల ముందు ఎంసీఏ అనే రొటీన్ సినిమా చేశాడు నాని. అప్పుడు అతనున్న ఊపులో రొటీన్ అయినప్పటికీ ఆ సినిమా బాగా ఆడేసింది. కొన్ని ఆకర్షణలు ఆ సినిమాకు కలిసొచ్చాయి. కానీ గత ఏడాది వచ్చిన వి మూవీ చూసినా.. ఇప్పుడు రిలీజైన టక్ జగదీష్ చూసినా.. నాని ఇలాంటి సినిమాలు ఎలా ఒప్పుకున్నాడు.. అతడికి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాలను రూపొందించింది మోహనకృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకులు కావడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. నాని రీచ్ పెంచుకోవడానికి ఇలాంటివి ట్రై చేస్తుండొచ్చు కానీ.. నాని సినిమాలంటే కొత్తగా ఉంటాయని అతడికి అభిమానులుగా మారిన వాళ్లు అతడికి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనుంచైనా నాని ఇలాంటి సినిమాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.
This post was last modified on September 13, 2021 12:02 pm
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…