కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మహేష్ బాబుతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. హిట్టు మీద హిట్టు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె మరో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా ఓ యంగ్ డైరెక్టర్ సినిమా కావడం విశేషం. నటుడిగా తెలుగు సినిమాల్లో నటించిన రాహుల్ రవీంద్రన్ ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తన రెండో సినిమా నాగార్జునతో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ‘మన్మథుడు’ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. సోషల్ మీడియాలో నాగార్జున ఫ్యాన్స్ రాహుల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ రాహుల్ రవీంద్రన్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు.
తాజాగా ఆయన ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గీతాఆర్ట్స్ సంస్థకు ఈ కథ నచ్చడంతో నిర్మించడానికి ముందుకొచ్చింది. హీరోయిన్ కీలకపాత్రలో ఈ సినిమా ఉండబోతుంది. దీనికోసం రష్మికను సంప్రదించగా.. ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమాతోనైనా.. రాహుల్ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి!
This post was last modified on September 11, 2021 10:20 am
త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ…
దేశంలోని మిగతా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు..దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో ఎత్తు.…
జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకి సంబంధించిన ఏ చిన్న అంశాన్ని వదలకుండా పబ్లిసిటీ విషయంలో దర్శకుడు…
అతడి వయసు 35 ఏళ్ల కంటే తక్కువే. అయితే.. టెక్నాలజీ మీద తనకున్న పట్టుతో ఈ భారత సంతతికి చెందిన…
సోషల్ మీడియా, సినిమా సెలబ్రిటీలను బాగా ఫాలో అయ్యేవాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు వామికా గబ్బి. ఇటీవలే వరుణ్ ధావన్…
మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్…