లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడం, థియేటర్లు తెరుచుకున్నాక కూడా కొన్ని నెలల పాటు అనుకున్న స్థాయిలో రెవెన్యూ ఉండేలా లేకపోవడంతో ఉన్నంతలో తమనకు కొంచెం బయటపడేసే మార్గం.. ఓటీటీ రిలీజే అని భావిస్తున్నారు నిర్మాతలు. చిన్న, మీడియం రేంజి సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ బాగానే ఆకర్షిస్తున్నాయి. మంచి ఆఫర్లతో టెంప్ట్ చేస్తున్నాయి.
దీంతో వివిధ భాషల్లో నిర్మాతలు తమ సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వాళ్లు వివిధ భాషల్లో అరడజనుకు పైగా పేరున్న సినిమాల్ని కొనేసి నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నిన్న జ్యోతిక సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ రిలీజైంది.
ఐతే ఇలా నేరుగా ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలకు ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. రెండు నెలల కిందట తెలుగులో ‘అమృతారామమ్’ అనే సినిమాను రిలీజ్ చేస్తే అది అడ్రస్ లేకుండా పోయింది. తెలుగులో తొలి ఓటీటీ రిలీజ్ మూవీగా దీనికి మంచి ప్రచారమే లభించింది. ఐతే అందులో విషయం లేకపోవడంతో జనాలు అసలు పట్టించుకోలేదు. ఆ రకంగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్రోగ్రాంకు పేలవ ఆరంభం దక్కినట్లయింది. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చి ఉంటే మరిన్ని చిన్న సినిమాలు ఆ బాట పట్టేవేమో.
తర్వాత తెలుగులో ఏ నిర్మాతా ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచించనేలేదు. ఇప్పుడు తమిళంలో మంచి ప్రచారంతో ప్రైమ్‌లో రిలీజైన జ్యోతిక సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ సైతం ఆశించిన ఫలితాన్నందుకునేలా లేదు. దీనికి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. దీని కంటే ముందే జీ5లో నేరుగా రిలీజైన ఓ తమిళ సినిమాకు కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇలా ఆన్ లైన్లో డైరెక్ట్ రిలీజైన సినిమాలన్నీ తుస్సుమంటుండటం ఒక అపశకునంలా మారింది. నేరుగా ఓటీటీలో రిలీజయ్యే సినిమా ఏదో ఒకటి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుని మీడియాలో హైలైట్ అయితే తప్ప మరింత మంది నిర్మాతలు అటు వైపు చూడటం కష్టమే.
This post was last modified on May 30, 2020 2:22 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…