నేచురల్ స్టార్ నాని కెరీర్లో కొన్ని మంచి అవకాశాలను వదులుకున్న సంగతి ‘టక్ జగదీష్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వెల్లడించాడు. తమిళంలో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘రాజా రాణి’తో పాటు తెలుగులో భారీ విజయాన్నందుకున్న ఎఫ్-2 సినిమా కూడా తాను డేట్లు ఖాళీ లేక వదులుకున్నట్లు అతను తెలిపాడు. ఐతే నాని ఈ సినిమాలను వదులుకున్నట్లు ఇంతకుముందు కూడా వార్తలొచ్చాయి.
ఐతే బాలీవుడ్లో ఓ మంచి ఆఫర్ వస్తే దాన్ని కూడా నాని తిరస్కరించిన విషయం ఇప్పుడు వెల్లడైంది. ‘లాల్ సింగ్ చద్దా’లో కీలక పాత్ర కోసం స్వయంగా ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ తనకు ఫోన్ చేసి అడిగినట్లు నాని తెలిపాడు. ఐతే అప్పటికే తాను రెండు సినిమాలతో బిజీగా ఉండటం.. వెంటనే ఆ చిత్రానికి డేట్లు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు వెల్లడించాడు.
నిజానికి ‘లాల్ సింగ్ చద్దా’లో ఈ పాత్ర కోసం ముందు విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ అతను డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమాకు దూరమయ్యాడు. ఆ తర్వాత నానికి ఆఫర్ వచ్చిన విషయం ఇప్పుడు వెల్లడైంది. నాని కూడా ఈ పాత్ర చేయలేకపోవడంతో చివరికి అక్కినేని నాగ చైతన్యకు అవకాశం దక్కినట్లుంది.
ఐతే ఒకరు వద్దన్న రోల్‌ను ఇంకొకరు చేయడాన్ని నామోషీగా భావించాల్సిన అవసరమేమీ లేదు. ఇలా అవకాశం అందుకుని పెద్ద విజయాలందుకున్న వారి జాబితా చాలా పెద్దదే. చైతూకు కచ్చితంగా ‘లాల్ సింగ్ చద్దా’ కెరీ్లో కీలక మలుపుగా నిలుస్తుందని భావిస్తున్నారు. తండ్రి నాగార్జున వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రంతో చైతూ బాలీవుడ్లో పాగా వెయ్యగలడని అంచనా వేస్తున్నారు. ఆమిర్ ఖాన్ సినిమాలో కీలక పాత్రతో దేశవ్యాప్తంగా చైతూకు మంచి గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on September 10, 2021 2:25 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…