Movie News

ఆ రీమేక్‌కు లైన్ క్లియర్

సూర్య కెరీర్ స్లంప్‌లో ఉన్న టైంలో అతడికి గొప్ప ఉత్సాహాన్నిచ్చిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగమ్మాయి సుధ కొంగర రూపొందించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులతో పాటు వేరే భాషల వాళ్లనూ ఆకట్టుకుంది. అమేజాన్‌ ప్రైమ్‌లో అత్యంత ఆదరణ సంపాదించుకున్న భారతీయ చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఈ సినిమా అనేక పురస్కారాలకు కూడా ఎంపికైంది.

‘సూరారై పొట్రు’ను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు కొన్ని నెలల కిందటే మొదలయ్యాయి. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి సూర్య ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. అక్షయ్ కుమార్ హిందీ వెర్షన్లో హీరో అని వార్తలొచ్చాయి.

ఐతే ఈ సినిమా మొదలుపెట్టబోతుండగా సూర్య అండ్ కోకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ‘సూరారై పొట్రు’ను సూర్య సంస్థతో కలిసి నిర్మించిన శిఖ్య ఎంటర్టైన్మెంట్.. తమ అనుమతి లేకుండా హిందీ రీమేక్ తీస్తున్నారంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ‘సూరారై పొట్రు’ రీమేక్‌పై స్టే విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కొన్ని వారాలుగా పనులన్నీ ఆపేసింది చిత్ర బృందం.

ఐతే ఇప్పుడు కోర్టు నుంచి సూర్య బృందానికి ఊరట లభించింది. ఇంతకుముందు ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మధ్యలో కోర్టు విచారణలో ఏం జరిగిందో.. సూర్య బృందం ఏం వివరణ ఇచ్చిందో కానీ.. ఇప్పుడు వారికున్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రి ప్రొడక్షన్ పనులు పున:ప్రారంభించి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అక్షయ్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేయనున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

This post was last modified on September 9, 2021 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago