పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్లు ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరమైనా.. ఆయన ఇమేజ్ ఎంతమాత్రం చెక్కు చెదరలేదు. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. దిల్ రాజు నిర్మించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి గాను పవన్ కళ్యాణ్ కి రెమ్యునరేషన్ గా రూ.50 కోట్లు ఇచ్చారు. రీఎంట్రీలో కూడా ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చారంటే.. దిల్ రాజుకి ఈ ప్రాజెక్ట్ పై ఎంతనమ్మకం ఉందో తెలుస్తోంది. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరిగింది.
ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకి గాను పవన్ కి రెమ్యునరేషన్ గా రూ.60 కోట్లు ఇస్తున్నారట. అంటే పవన్ పారితోషికాన్ని మైత్రి మరో పది కోట్లు పెంచి ఇస్తుందన్నమాట. అయితే ‘వకీల్ సాబ్’తో పోలిస్తే ఈ సినిమాకి పవన్ కాల్షీట్స్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.
పవన్ మాత్రం వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అదే విషయాన్ని హరీష్ శంకర్ కి కూడా చెప్పాడట. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం కావాలి. అందుకే వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు పవన్. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు పవన్.
Gulte Telugu Telugu Political and Movie News Updates