Movie News

హిందీ వ‌ద్దు.. ఇంగ్లిష్ ముద్దు

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం మొద‌లైన‌ప్ప‌టి నుంచి హిందీ చిత్రాల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా త‌యారైందో తెలిసిందే. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా దెబ్బ‌కు బాలీవుడ్ అల్లాడిపోతోంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్, సెకండ్ వేవ్ త‌ర్వాత మిగ‌తా భాషల్లో సినిమాలు బాగానే విడుద‌ల‌వుతున్నాయి. ఉన్నంత‌లో మంచి ఫ‌లితాలే వ‌స్తున్నాయి.

కానీ హిందీ చిత్రాల‌ ప‌రిస్థితి మాత్రం దారుణం. ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత చాలా వ‌ర‌కు చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలే రిలీజ‌య్యాయి. వాటిని అస్స‌లు ప‌ట్టించుకోలేదు హిందీ ప్రేక్ష‌కులు. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడాల‌న్న ఉత్సాహ‌మే వారిలో క‌నిపించ‌లేదు. క‌నీసం సెకండ్ వేవ్ త‌ర్వాత అయినా ప‌రిస్థితి మారుతుంద‌నుకుంటే అలాంటి సంకేతాలేమీ క‌నిపించ‌లేదు.

ఈసారి అక్ష‌య్ కుమార్ లాంటి పెద్ద హీరో న‌టించిన బెల్ బాట‌మ్ చిత్రాన్ని ఎన్నో ఆశ‌ల‌తో రిలీజ్ చేస్తే దానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. బాలీవుడ్ ఆశించిన రివైవ‌ల్ క‌నిపించ‌లేదు. అమితాబ్ బ‌చ్చ‌న్ మూవీ చెహ్రె ప‌రిస్థితీ ఇంతే. ఐతే హిందీ సినిమాలు ఏ స్థాయివి రిలీజ్ చేసినా ప‌ట్టించుకోని ప్రేక్ష‌కులు.. ఇంగ్లిష్ చిత్రాల‌కు మాత్రం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

ఈ మ‌ధ్యే రిలీజైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్-9.. అలాగే షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ సినిమాల‌కు దేశ‌వ్యాప్తంగా చాలా మంచి వసూళ్లు వ‌స్తున్నాయి. బెల్ బాట‌మ్‌తో పోలిస్తే వీటికి రోజువారీ వ‌సూళ్లు రెండు మూడు రెట్లు వ‌స్తున్నాయి. ఈ చిత్రాల‌ను చూడ్డానికి హిందీ ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తునే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. వీకెండ్లోనే కాక వీక్ డేస్‌లోనూ ఈ చిత్రాల థియేట‌ర్లు ఆడియ‌న్స్‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. మ‌రి హాలీవుడ్ సినిమాల మీద ఉన్న ఆస‌క్తి బాలీవుడ్ మూవీస్ మీద నార్త్ ఆడియ‌న్స్ ఎందుకు చూపించ‌డం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌.

This post was last modified on September 7, 2021 9:23 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

4 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

4 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

4 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

6 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago