గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతుంటుంది తరచుగా. ‘మి టు’ ఉద్యమంలో భాగంగా ఆమె అలుపెరగని పోరాటం చేస్తోంది కొన్నేళ్లుగా. ఈ క్రమంలో మహిళల హక్కులు, సాధికారత, వారిపై వివక్ష, వేధింపులు లాంటి అంశాల మీద బలంగా తన గళం వినిపిస్తూ ఉంటుందామె.
ఐతే ఎప్పుడూ ఈ విషయాల్లో నీతులు చెప్పే ఆమె.. కొన్నిసార్లు తన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటుందనే విమర్శలు చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా చిన్మయి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. గతంలో ఒకసారి చిన్మయి సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేసింది. అలాగే సోషల్ మీడియాలో మహిళల్ని ఏడిపించడం, వాళ్ల మీద కౌంటర్లు వేయడం గురించి కూడా పోస్టులు పెట్టింది.
కట్ చేస్తే ఇప్పుడు సమంత మీద ఏదో కామెంట్ చేయడం ద్వారా పూజా హెగ్డే వివాదం రాజేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చింది. అప్పటికి అందరూ పూజానే తప్పుబట్టారు. సమంత వైపు నిలిచారు. కానీ ఇంతలో చిన్మయి లైన్లోకి వచ్చింది.
సమంత టీం అంటూ ట్వీట్ వేసి నందిని రెడ్డి తదితరులను లైన్లోకి తీసుకుంది. వీళ్లంతా కలిసి పూజా మీద కౌంటర్లు వేస్తూ ట్వీట్లు వేశారు. ఈ సంభాషణంతా స్క్రీన్ షాట్లు తీసి సమంత, చిన్మయిల మీద ఎటాక్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
ముఖ్యంగా చిన్మయినైతే విపరీతంగా తిడుతున్నారు. దీనిపై చిన్మయి స్పందించింది. తనను ఎలా బూతులు తిడుతున్నారో వెల్లడిస్తూ స్క్రీన్ షాట్లు షేర్ చేసింది. తాను మహిళల సమస్యల మీద మాట్లాడినా.. ఇంకేం చేసినా నెటిజన్ల రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని వాపోయింది.
కానీ ఇంతకుముందు చిన్మయి చేసిన ట్వీట్లేంటి.. ఆమె ఇప్పుడు చేసిన పనేంటి అంటూ ట్విట్టర్ జనాలు ఆమెపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఒకరు ప్రస్తావిస్తే.. తాను చేసింది తప్పే అన్నట్లు మాట్లాడిన చిన్మయి.. ఆ మాత్రానికి తనను వేశ్య అంటూ బూతులు తిడతారా అంటోంది.
This post was last modified on May 29, 2020 2:47 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…