Movie News

థియేటర్లు ఇంకెప్పటికీ ఒకప్పట్లా ఉండవా?

తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకుని నెల రోజులు దాటింది. కొత్త సినిమాలు వ‌స్తున్నాయి. వెళ్తున్నాయి. కానీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. వ‌సూళ్లు నామ‌మాత్రంగానే వ‌స్తున్నాయి. ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం, పాగ‌ల్ లాంటి ఒక‌ట్రెండు సినిమాలకు మాత్ర‌మే ఓపెనింగ్స్ సంద‌డి క‌నిపించింది. థియేట‌ర్లు నిండాయి. మిగ‌తా సినిమాల‌కు టాక్‌తో సంబంధం లేకుండా థియేట‌ర్లు డ‌ల్లుగా క‌నిపించాయి. చాలా మంచి టాక్ తెచ్చుకున్న రాజ‌రాజ చోర‌కు కూడా వ‌సూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల ప‌రిస్థితి ఇది.

ఇక ఇండియాలో మిగ‌తా రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ ప‌రిస్థితి గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొత్త సినిమాలు రిలీజ్ చేయ‌డానికే భ‌య‌ప‌డిపోయేలా వ‌సూళ్లు ఉంటున్నాయి. థియేట‌ర్ల మెయింటైనెన్స్ ఖ‌ర్చులు కూడా రావ‌ట్లేదు. అక్ష‌య్ కుమార్ లాంటి పెద్ద హీరో సినిమా బెల్‌బాట‌మ్‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ప‌రాభ‌వం ఎదురైందో తెలిసిందే.

ప‌రిస్థితులు చూస్తుంటే.. ఒక‌ప్ప‌ట్లా థియేట‌ర్లు ఎప్ప‌టికీ క‌ళ‌క‌ళలాడ‌వా.. క‌రోనా పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టినా కూడా మునుప‌టిలా థియేట‌ర్ల నుంచి రెవెన్యూ ఉండ‌దా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రేక్ష‌కుల జీవ‌న శైలిలో తెచ్చిన మార్పు.. థియేట‌ర్ల‌కు పెద్ద‌గా శాపంలాగా మారింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. వీకెండ్ వ‌స్తే థియేట‌రుకెళ్లి సినిమా చూడ్డం.. అట్నుంచి అటే రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయ‌డం.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ఎప్ప‌ట్నుంచో ఉన్న వినోద మార్గం. ఐతే క‌రోనా కార‌ణంగా ఈ అల‌వాటు త‌ప్పింది. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడ్డం కొన్ని నెల‌ల పాటు ఆగిపోయింది. అలాగే రెస్టారెంట్ల‌కు వెళ్లి భోంచేసే అల‌వాటూ త‌ప్పింది. దీనికి తోడు.. క‌రోనా కాలంలో ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు జ‌నాలు. ప్ర‌తి ఇంట్లోనూ ఓటీటీల స‌బ్‌స్క్రైబ‌ర్లుంటున్నారు. కొత్త సినిమాలు, సిరీస్‌లు నేరుగా అందులో చూడ్డానికి అల‌వాటు ప‌డ్డారు.

థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే కొత్త చిత్రాలు కూడా కొన్ని రోజులాగితే ఓటీటీల్లో వ‌స్తాయన్న ఆలోచ‌న‌లోకి ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు వెళ్లిపోయారు. పైగా థియేట‌ర్‌కెళ్లి ఒక ఫ్యామిలీ సినిమా చూసే ఖ‌ర్చుతో సంవ‌త్స‌రం పాటు ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్లు వ‌స్తుండ‌టం వారి ఆలోచ‌న‌లో మార్పుకు కార‌ణ‌మ‌వుతోంది. రెగ్యుల‌ర్ సినీ గోయ‌ర్స్ ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌కు వ‌స్తున్నా.. ఫ్యామిలీస్‌లో కొంత శాతం మ‌ళ్లీ థియేట‌ర్ల వైపు చూస్తున్నా.. మునుప‌టి స్థాయిలో మాత్రం లేద‌న్న‌ది స్ప‌ష్టం. అలా చెప్పుకోద‌గ్గ స్థాయిలో థియేట‌ర్ ప్రేక్ష‌కుల‌ను లాస్ అయిపోయింది ఫిలిం ఇండ‌స్ట్రీ. కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌ థియేట‌ర్ల రెవెన్యూలో కొంత మేర శాశ్వ‌తంగా కోల్పోయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇంకెప్ప‌టికీ థియేట‌ర్లు ఒక‌ప్ప‌టి స్థాయిలో ఆదాయం రాబ‌ట్ట‌లేవ‌న్న‌ది స్ప‌ష్టం.

This post was last modified on September 5, 2021 10:39 am

Share
Show comments

Recent Posts

తెలంగాణలో దారుణం.. పట్టపగలే కత్తితో పొడిచి..

తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…

18 minutes ago

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

37 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

58 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

1 hour ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

3 hours ago