హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ అన్న సంగతి తెలిసిందే. గ్లామర్ ఉన్నంత వరకే వాళ్ల మెరుపులన్నీ. ఫిజిక్, లుక్ కొంచెం తేడా కొట్టగానే అవకాశాలు తగ్గిపోతాయి. అలా తగ్గడం మొదలయ్యాక మళ్లీ కెరీర్లో పుంజుకోవడం కష్టమే. అందులోనూ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైతే హీరోయిన్‌గా కెరీర్‌కు దాదాపు తెరపడినట్లే. కొంతమంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా కథానాయికగా అవకాశాలు అందుకుంటారు. ఓ మోస్తరుగా అయినా కెరీర్‌ను నడిపిస్తారు. కొందరేమో హీరోయిన్ వేషాలు ఆగిపోయాక కొంచెం గ్యాప్ తీసుకుని అక్క, వదిన, తల్లి పాత్రల్లోకి మారిపోతుంటారు.
దక్షిణాది భామ ప్రియమణి పరిస్థితి కూడా ఇలాగే అవుతుందని అంతా అనుకున్నారు. తెలుగులో ఒకప్పుడు కథానాయికగా ఒక ఐదారేళ్లు మంచి ఊపు మీద ఉంది ప్రియమణి. కానీ తర్వాత ఊపు తగ్గింది. చాలా వేగంగా ఆమె ఫేడవుట్ అయిపోయింది. ఇండస్ట్రీ నుంచి అంతర్థానం అయిపోయింది.
అంతలోనే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడటం.. కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించడం తప్ప సినిమాల్లో కనిపించకపోవడంతో ఆమె కెరీర్ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ ఆశ్చరకరంగా ఆమె కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఇందుక్కారణం ఒక వెబ్ సిరీస్ కావడం విశేషం. అదే.. ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్‌లో ఇద్దరు పిల్లల తల్లిగా ప్రియమణి చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ దేశవ్యాప్తంగా ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రియమణి ఎంతో పరిణతితో ఈ పాత్రను పండించిన విధానం అందరినీ మెప్పించింది. దీంతో ఉన్నట్లుండి సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం మొదలైంది.
ఇప్పటికే తెలుగులో నారప్ప, విరాటపర్వం లాంటి పెద్ద చిత్రంలో నటించిన ప్రియమణి.. త్వరలోనే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేయనున్న సినిమాలోనూ ప్రియమణికి ఓ కీలక పాత్ర దక్కినట్లు సమాచారం. బాలీవుడ్లో కచ్చితంగా ప్రియమణికి ఈ పాత్ర ఒక మలుపు అయ్యే అవకాశముంది. ఇంకా వివిధ భాషల్లో ప్రియమణికి అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ ప్రియమణి కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పినట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 5, 2021 10:20 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…