Movie News

సినీ ప్రముఖులను అడ్డంగా బుక్ చేసిన కెల్విన్ ?

2017లో టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ డ్రగ్స్ కేసు విచారణలోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఈడీ దాదాపు 10 గంటల పాటు విచారణ జరిపింది. అయితే, నాలుగేళ్లుగా అటకెక్కిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం, ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఉన్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ఈడీకి కెల్విన్ అప్రూవర్ గా మారడంతోనే ఈ వ్యవహారంలో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చిందని తెలుస్తోంది. కెల్విన్ అందించిన సమాచారంతోనే సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తోంది. కెల్విన్ చెప్పిన వివరాల ఆధారంగా ఇక్కడి నుంచి విదేశాలకు భారీగా నగదు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించిందని ప్రచారం జరుగుతోంది. అందుకే, పూరీ జగన్నాథ్ విచారణ సమయంలోనూ ప్రధానంగా నగదు బదిలీపైనే ఈడీ ఫోకస్ చేసిందని, 2015 నుంచి పూరీ బ్యాంకు ఖాతాల వివరాలపై ఆరా తీసిందని తెలుస్తోంది.

ఆఫ్రికా దేశాల‌కు కూడా పూరీ న‌గ‌దు పంపిన‌ట్లు బ్యాంకు స్టేట్ మెంట్లో ఉందని, కెల్విన్ ఖాతాల‌కు పూరీ డ‌బ్బు ఎందుకు పంపార‌ని కూడా ఈడీ ప్రశ్నించిందని తెలుస్తోంది. పూరీ బ్యాంకు లావాదేవీల‌ను, కెల్విన్ బ్యాంకు స్టేట్ మెంట్ల‌ను ఈడీ అధికారులు పూరీ ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారని, అందుకే 10 గంటలపాటు విచారణ సాగిందని తెలుస్తోంది. పూరీ త‌ర్వాత విచార‌ణ‌కు హాజ‌రు కాబోయే సినీ ప్ర‌ముఖుల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురుకానుంద‌ని తెలుస్తోంది.

వాస్తవానికి, కెల్విన్ ను గతంలోనే ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపారు. కానీ, ఆ సందర్భంగా కెల్విన్ నోరు మెదపలేదని తెలుస్తోంది. కానీ, 6 నెలల క్రితం కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ మొదలుబెట్టింది. గత 6 నెలలుగా దాదాపు 12 సార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారని, కెల్విన్ బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారని తెలుస్తోంది.

ఇక, ఈడీ తమదైన శైలిలో విచారణ జరపడంతో కెల్విన్ నోరు విప్పక తప్పని పరిస్థితి వచ్చిందట. ఈ క్రమంలోనే కెల్విన్ అప్రువర్ గా మారి, పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కెల్విన్ ఖాతాల‌ను సీజ్ చేసిన తరహాలోనే సినీ ప్ర‌ముఖుల బ్యాంకు ఖాతాల‌ను కూడా సీజ్ చేసే యోచనలో ఈడీ ఉందని తెలుస్తోంది. కెవిన్ అప్రూవ‌ర్ గా మారి సినీ ప్ర‌ముఖుల‌ను అడ్డంగా బుక్ చేశాడన్న టాక్ వస్తోంది.

This post was last modified on September 1, 2021 8:56 pm

Share

Recent Posts

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 seconds ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

3 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

3 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

6 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

9 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

10 hours ago